చిత్రం చెప్పే విశేషాలు (01-10-2023/1)

హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనలో భాగంగా శనివారం రాత్రి సచివాలయం, చారిత్రక చార్మినార్‌లకు విద్యుద్దీపాలను అలంకరించారు. దీంతో గులాబీ శోభ సంతరించుకుంది.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో శనివారం సినీనటుడు మహేశ్‌బాబు కుమార్తె సితార సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘బొమ్మలకొలువు’లో తల్లి నమ్రతా శిరోద్కర్‌తో హాజరై వృద్ధులు, పిల్లలతో సరదాగా గడిపారు.

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023 పోటీలు అక్టోబరు 5 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని జేసీ అకాడమీ చిన్నారులు, లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రపంచ కప్‌ నమూనాతో శనివారం ప్రదర్శన నిర్వహించారు.

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతోంది. నందిపేట్‌ మండలం ఉమ్మెడ శివారులోని వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. పక్కన ఉన్న ప్రసిద్ధ ఉమామహేశ్వరాలయం సగం వరకు నీట మునిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ తెర అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ఆవిష్కృతమైంది. దీన్ని గోళాకారంలో రూపొందించారు.రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ అద్భుతమైన గ్లోబ్‌ను నిర్మించారు.

హైదరాబాద్‌ నగరంలో త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇందుకోసం ఉత్తర్‌ప్రదేశ్‌లో తయారు చేసిన బస్సును భారీ ట్రాలీపై రాజధానికి తీసుకెళుతున్నారు.

నల్గొండ పురపాలక సంఘంలో చెత్తను సేకరించే ట్రాక్టర్‌ వాహనంపై డ్రైవర్‌తో పాటు పెంపుడు కుక్క కూడా తోడుగా వెళ్తోంది.

హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి సర్వీసు రోడ్డు వెంట 23 కి.మీ. మేర నిర్మిస్తున్న అధునాతన సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. అక్టోబరు 1న దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home