చిత్రం చెప్పే విశేషాలు.. (12-10-2023/1)
హైదరాబాద్‌లో పండగలు వచ్చాయంటే చేతివృత్తుల వారికి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది. దీపావళికి నెల రోజుల ముందుగానే ఆసిఫ్‌నగర్, కార్వాన్, కుల్సుంపుర, పాతబస్తీలోని కుమ్మరి వాడల్లో దొంతులు, ప్రమిదలను కుమ్మరులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.
ఓరుగల్లులో బుధవారం సినీనటి రాశీఖన్నా సందడి చేశారు. హనుమకొండ నయీంనగర్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఆమెను చూడటానికి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
విశాఖపట్నంలోని రుషికొండ తీరప్రాంతం డంపింగ్ యార్డును తలపిస్తోంది. సందర్శకులు సందడిచేసే ప్రాంతంలో గుడ్డ పీలికలతో నిండిపోతుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలు పేరుకు పోతున్నాయి.
నెల్లూరులోని గంధోత్సవాల నేపథ్యంలో ఎ.ఎస్.పేట, కసుమూరు దర్గాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్‌లోని మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై మ్యాన్‌హోల్ కుంగి గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. ఇలా కర్రలు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితమే కానీ, ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవాలి. ప్రసూతి వార్డులో రెండు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నా గాలి సరిపోవడం లేదు. దీంతో స్టాండింగ్ పంకాలు అద్దెకు తెచ్చుకుంటున్నారు.
పచ్చటి వృక్షాలు.. చల్లటి వాతావరణంతో ఆకట్టుకునే నగరం కాంక్రీటు అరణ్యంలా మారిపోతోంది. బోరబండ సున్నం చెరువు సమీప బస్తీ నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్-4 వైపు కనిపిస్తున్న గృహ నిర్మాణాలు, భారీ భవంతులు ఇవి.
విశాఖ నగరంలోని ధారపాలెంకు చెందిన రౌతు విజయ్ కుమార్ తన ఇంటి పెరటిలో బొప్పాయి చెట్టును పెంచారు. బుధవారం పండిన బొప్పాయి పండును కోయగా.. అందులో తెల్లటి రంగుతో ఉన్న మరో బొప్పాయి దర్శనమిచ్చింది.