చిత్రం చెప్పే విశేషాలు..
(05-12-2023/1)
హైదరాబాద్ నగరంలో సందర్శనీయ ప్రదేశాలు కొత్త అందాలు అద్దుకుంటున్నాయి. పబ్లిక్ గార్డెన్ ముఖద్వారానికి రంగులు వేస్తున్న చిత్రం.
కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా దుర్గాఘాట్ భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల భక్తులు తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అరటిదొప్పల్లో కార్తిక దీపాలు వెలిగించారు.
విశాఖపట్నంలో తుపాన్ ప్రభావంతో మత్స్యకారులు వణికిపోతున్నారు. సాధారణం కన్నా 30 మీటర్లు ముందుకు సముద్రం రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
హైదర్నగర్లో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీముఖి సందడి చేసింది.సమతా నగర్లోని శ్రీ పుష్కర ఆర్ట్స్ స్టూడియో ఉమెన్స్ వస్త్ర దుకాణాన్ని సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
కార్తికమాసోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రుద్రేశ్వరుడికి లక్ష తులసీ దళాలతో దళార్చన చేశారు.
చలికాలంలో మంచుపొగతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం పూర్తిగా మంచుపొగ నిండి ఉంది.
ఇందేటి ‘వంటలక్క’ ఫొటో ఇక్కడుందని అనుకుంటున్నారా... ఖమ్మం జిల్లాలోని గోపాలపురం శివారులో ఓ రైతు తన మిరపతోటలో ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో దారిన వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా నందిగామలో భారీ బండరాళ్లను ఇలా కార్యాలయం ఆవరణలో అందంగా పేర్చారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా వైమానిక దాడులను ప్రారంభించింది. నిన్న ఒక్క రాత్రే వందల కొద్దీ హమాస్ స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి.