చిత్రం చెప్పే విశేషాలు..!
(27-07-2022/1)
నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్‌పట్ల గ్రామంలోని బలరాముడి విగ్రహం ఆ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రైతు బతుకు చిత్రానికి ప్రతీకగా ఉండే.. బలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులే నిర్ణయించుకున్నారు.
Source: Eenadu
భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రహేజా మైండ్‌స్పేస్ నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వరకు నాలుగులైన్ల శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నగరంలోని పొడవైన సేతువుల్లో ఒకటిగా ఇది నిలవనుంది.
Source: Eenadu
ప్రసిద్ధ చిత్రకారులు గీసిన వాటిలా ఉన్న ఈ చిత్రాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. విశాఖ సాగర తీరంలో అలలు ముందుకు వచ్చి... మళ్లీ వెనక్కి వెళ్లే సమయంలో ఇసుక తిన్నెలపై ఏర్పడిన సైకత చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
Source: Eenadu
విశాఖపట్నంలోని ‘నైట్‌ఫుడ్ స్ట్రీట్’లో ఓ యువకుడి వినూత్న వంట తీరు ఆకట్టుకుంటోంది. ఉపయోగంలో లేని కారు ముందుభాగంలో ఇంజిన్‌ను తొలగించి అందులో గ్యాస్‌స్టౌవ్ అమర్చాడు. దానిపై మాంసాహార వంటలు తయారు చేసి విక్రయిస్తున్నాడు.
Source: Eenadu
పెదవాల్తేరు జీవవైవిధ్య ఉద్యానవనంలో కుండీల్లో నాటిన కాక్టస్ మొక్కలు ఇలా రంగు రంగుల్లో కనిపిస్తూ.. అక్కడకొచ్చే విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఎడారి జాతి మొక్కలు చిన్న సైజులో చూడ ముచ్చటగా కనువిందు చేస్తున్నాయి.
Source: Eenadu
తూర్పుగోదావరి జిల్లా నేలకోట ఆవలో దొరికే చేప కోసం భోజనప్రియులు ఎగబడతారు. వర్షాకాలం ప్రారంభమైన సమయంలో దొరికే రామవరపు చేపకు ఆస్తులమ్మైనా ఆవ చేప తిన్సాలిందేనంటారు. నేలకోట వెళితే నిర్ణయించిన ధరకే తూకం వేసి చేప ఇస్తారు.
Source: Eenadu
అడుగడుగునా గుంతలతో నిండిన రహదారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. తాళ్లపూడి నుంచి వేగేశ్వరపురం వెళ్లే మార్గంలోని చిత్రమిది.
Source: Eenadu
వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.2కోట్ల విలువైన 62,461 మద్యం సీసాలను మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. నున్నలోని మామిడి మార్కెట్ యార్డు ఆవరణలో మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.
Source: Eenadu
చిత్తూరు నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫులే కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అయితే పోలీసులు హెల్మెట్ లేకుండా తిరిగినా వారిని వదిలేసి తమకు మాత్రమే చలానాలు విధించడం పట్ల పలువురు చోదకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Eenadu