చిత్రం చెప్పే విశేషాలు..!

(28-07-2022/1)

అమరావతిలో నిర్మించిన రహదారులు పశువుల కాపరులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఐనవోలు, నీరుకొండ వెళ్లే రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి, గొర్రెల కోసం పాకలు, దాని చుట్టూ ఇను కంచెలు నిర్మించుకున్నారు.

Image: Eenadu

విశాఖ జిల్లా కైలాసగిరి కొండ కింద నుంచి పైకి చేరుకునే వరకూ రహదారి పలు చోట్ల ప్రమాదకరంగా మారింది. మార్గానికి ఓ వైపు గోతులు తవ్వి వాటిని మట్టితో కప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మట్టి మొత్తం కొట్టుకుపోయింది.

Image: Eenadu

వీరవాసరం మండలం రాయకుదురు పశువైద్యశాల సమీపాన ఓ స్తంభానికి అల్లుకున్న తీగజాతి మొక్క ఇలా మానవ ఆకృతిని పోలి ఆకట్టుకుంటోంది.

Image: Eenadu

ఎండా వానల నడుమ బుధవారం గోదావరిపై ఆవిష్కృతమైన ఇంద్రధనస్సు అలరించింది. గోదావరి అందాలు తిలకించేందుకు కాటన్‌ బ్యారేజీపైకి వచ్చిన ప్రజలు దీనిని చూస్తూ పరవశించి పోయారు.

Image: Eenadu

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఈ నెల 29న సీఎం జగన్‌ పర్యటించనున్నారు. గొల్లప్రోలులోని ప్రధాన రహదారిపై ఉన్న వంతెనలు శిథిలమై అత్యంత ప్రమాకరంగా ఉన్నాయి. దీంతో కనీస మరమ్మతులు చేపట్టకుండా రంగులు వేసి మాయ చేస్తున్నారు.

Image: Eenadu

దర్శి మండలం పొతకమూరు ఉన్నత పాఠశాలను బుధవారం జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించడంతోపాటు స్వయంగా విద్యార్థులకు తినిపించారు.

Image: Eenadu

ఈ చిత్రం చూశారా.. వానరానికి దాహం వేయడంతో కొళాయి వద్దకు వచ్చింది. ఆ సమయంలో కొళాయిని పలుమార్లు తిప్పినా నీరు రాలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.

Image: Eenadu

నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాళెం సమీపంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో దుమ్ము విపరీతంగా లేస్తోంది. నీటిని చల్లించాల్సి ఉన్నా గుత్తేదారు పట్టించుకోకపోవడంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.

Image: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home