చిత్రం చెప్పే విశేషాలు..!
(15-08-2022/2)
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. జాతీయ జెండాలు చేతబూని ‘యే హమారా తిరంగా’ అంటూ వీధుల్లో, రహదారులపై ప్రదర్శన చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద కనిపించిన సందడి ఇది.
Source: Eenadu
ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీతో కలిసి స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.
Source: Eenadu
సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్సీ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శునకాలు సాహస విన్యాసాలతో ఆకట్టుకున్నాయి.
Source: Eenadu
ప్రముఖ సినీ నటుడు అల్లుఅర్జున్ తన నివాసం వద్ద నిర్వహించిన స్వాతంత్రోద్యమ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Source: Eenadu
బాలీవుడ్ నటి ప్రీతి జింటా అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఆమెతో పాటు తన కవల పిల్లలు జై, జియాలు జాతీయ జెండాలను పట్టుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.
Source: Eenadu
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన 175మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 55మంది ఖైదీలను విడుదల చేశారు.
Source: Eenadu
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘వన్ నేషన్- వన్ డ్యాన్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఓ బాలుడు పజిల్స్ క్యూబ్‌లతో ప్రధాని మోదీ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు.
Source: Eenadu
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కుత్బుల్లాపూర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌కు చెందిన వృద్ధుడు మహ్మద్ ఆఫ్టల్. ఈయనకు 63ఏళ్లు.. ఆగస్టు 15న జన్మించాడు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజున జాతీయ జెండాను ద్విచక్రవాహనానికి కట్టుకొని నగరమంతా సంచరిస్తుంటాడు.
Source: Eenadu
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూసాపేట గ్రీన్‌హిల్స్ రోడ్‌లోని రెయిన్‌బో విస్తా రాక్ గార్డెన్‌లో 2కిలోమీటర్ల భారీ జాతీయ పతాకంతో గేటెడ్ కమ్యూనిటీవాసులంతా ప్రదర్శన నిర్వహించారు.
Source: Eenadu