చిత్రం చెప్పే విశేషాలు..!

(16-08-2022/2)

ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలో దారుణ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య మృతదేహం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన గ్రామస్థులతో పాటు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Source: Eenadu

తాను కదల్లేని స్థితిలో ఉన్నా.. భారతీయులందరి మనసులు కదిలించేలా ఈ చిత్రం గీశాడు దివ్యాంగ కళాకారుడు ఆయుష్‌ కుందాల్‌. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలితో కుంచె పట్టి భరత మాతకు జవాన్‌ సెల్యూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాడు.

Source: Eenadu

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని గీతా భవన్‌ కూడలిలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని జాతీయగీతం ఆలపించారు. అదే సమయంలో కొందరు కొలిమి పని చేసే శ్రామికులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు.

Source: Eenadu

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన లెజెండరీ లీడర్ వాజ్‌పేయీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దివంగత ప్రధాని వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి గవర్నర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Source: Eenadu

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి ఏపీ సీఎం జగన్‌ వెళ్లారు. ఇటీవలే వాసుపల్లి కుమారుడు సూర్యకు రాశితో వివాహం జరిగింది. ఈ నూతన దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు.

Source: Eenadu

జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. గురువారం తొలి మ్యాచ్‌. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం భారత జట్టు హరారేలో అడుగుపెట్టింది. గెలుపు మనదే కావాలని ఆటగాళ్లు ఇలా మైదానంలో కృషి చేస్తున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ కూకట్‌పల్లి వద్ద ఈ ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. కూకట్‌పల్లి నుంచి మూసాపేట వరకు జాతీయ పతాకం కనిపిస్తున్న ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.

Source: Eenadu

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పిస్తున్న ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home