చిత్రం చెప్పే విశేషాలు..!

(17-08-2022/2)

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.

Source: Eenadu

రజనీకాంత్‌ నట ప్రస్థానం మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీ.. ఆయన సతీమణి లత సమక్షంలో కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Source: Eenadu

నటి సోనాలీ బింద్రే అట్లాంటా పర్యటనకు వెళ్లారు. అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘ఓ అమ్మాయిని మీరు భారత్‌ నుంచి దూరంగా తీసుకురావచ్చు.. కానీ, ఆమె నుంచి భారతీయతను విడదీయలేరు’ అంటూ ఓ పోస్టు పెట్టారు.

Source: Eenadu

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవంలో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని అగ్నిమాపక సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టారు. వారు వినియోగించే అగ్నిమాపక వాహనాలతో చార్మినార్‌ నుంచి ఉప్పల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. హబ్సిగూడ వద్ద కనిపించిన దృశ్యాలివి.

Source: Eenadu

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ అప్పిరెడ్డిపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరింది. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి పైలాన్‌ను ఆవిష్కరించారు.

Source: Eenadu

సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందలలో ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.

Source: Eenadu

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన సినిమా లైగర్‌. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ అమ్మ తన ఇంటి వద్ద సినిమా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

పర్యావరణ శాస్త్రవేత్త బ్రియాన్‌ బెడ్రోసియాన్‌ యూఎస్‌లోని వ్యోమింగ్‌ రాష్ట్రంలో ఓ గద్దకు ట్రాకింగ్‌ పరికరాన్ని అమర్చి తిరిగి దాని గూటికి చేర్చారు. అక్కడ వేట, వాహనాలు ఢీకొనడం కారణంగా గద్దలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి.

Source: Eenadu

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమానికి పలు పాఠశాలల విద్యార్థులు, నగరవాసులు హాజరై ఫ్రీడమ్‌ ఫైటర్స్‌కు చెయ్యెత్తి జై కొట్టారు.

Source: Eenadu

స్పెయిన్‌లోని బీజిస్‌లో కార్చిచ్చు సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన హెలికాప్టర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్‌లో 2.75లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కార్చిచ్చులు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Source: Eenadu

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇది సాకర్‌ లీగ్‌ అని, నేను కచ్చితంగా ఫాలో అవుతానని పోస్టు పెట్టారు. ఇదో అందమైన ప్రీమియర్‌ సోలార్‌ లీగ్‌ అని తెలిపారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home