చిత్రం చెప్పే విశేషాలు!

(18-08-2022/2)

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మక్తల్ నియోజకవర్గంలో 125వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ఊట్కూరు మండలంలోని ఓ రైతు పొలంలో నాగలి పట్టి పొలం దున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌-నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాళ్లలోని మొక్కలను పరిశీలించారు.

Source: Eenadu

మెహదీపట్నంలోని భోజగుట్టపై పిచ్చుక గూళ్లలా కన్పిస్తున్న పేదల ఇళ్లు ఇవి. తమకు మరో చోట ఇళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ప్రస్తుతం ఉంటున్న ఇళ్లకైనా పట్టా ఇస్తే సొంతంగా కొత్త ఇళ్లు నిర్మించుకొనేందుకు వీలుంటుందని ఈ బస్తీవాసులు కోరుతున్నారు.

Source: Eenadu

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ముంబయిలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సును ప్రారంభించి అందులో కొంత దూరం ప్రయాణించారు. ఇది భారత్‌లో మొట్ట మొదటి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు కావడం విశేషం.

Source: Eenadu

బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబోట్‌ కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉండే రోబో లెగ్స్‌, వీల్‌ఛైర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Source: Eenadu

కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు.

Source: Eenadu

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గండిలో 45 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు.

Source: Eenadu

హరియాణాలోని చండీ మందిర్‌లో భారత్‌-వియత్నాం దేశాలు సయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సైనికులు హెలికాప్టర్ల నుంచి వేలాడుతూ.. ఆయుధాలను ప్రయోగిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు.

Source: Eenadu

నిజామాబాద్‌ జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన రైతు చిన్నికృష్ణుడు తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో నెల రోజులకు పైగా కష్టపడి 36 రకాల వరి వంగడాల నారుతో తల్లి భూదేవి, తండ్రి ముత్తన్న చిత్రాలను తీర్చిదిద్దాడు.

Source: Eenadu

శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ఏలూరు, పశ్చిమగోదావరిలో ఇటీవల ఆవిష్కృతమైన కొన్ని చిత్రాలివి. ఏలూరులో ఓ ఇంటి పిల్లర్‌పై బల్బులా కనిపిస్తున్న సూర్యుడిని ఫొటోలో చూడవచ్చు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home