చిత్రం చెప్పే విశేషాలు..!

(19-08-2022/2)

కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గన్‌పౌండ్రి మహబూబియా స్కూల్‌లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు.

Source: Eenadu

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొని ఫొటోలను తిలకించారు.

Source: Eenadu

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

Source: Eenadu

బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ కృష్ణాష్టమి సందర్భంగా తన సతీమణి అక్షతతో కలిసి అక్కడి భక్తి వేదాంత మనోర్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు.

Source: Eenadu

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామంలోని సంచార జాతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు.

Source: Eenadu

లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీ నటుడు విజయ్‌ దేవరకొండ బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నివాళి అర్పించారు.

Source: Eenadu

బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబో కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. ఇందులో చేతులను కదిలిస్తూ పాటలు పాడే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Source: Eenadu

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్‌ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home