చిత్రం చెప్పే విశేషాలు..!

(21-08-2022/2)

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ మహా కుంభాభిషేకం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

తిరుపతి నగరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 4వ విడత జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు.

Source: Eenadu

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ సీనియర్‌ నేత సునీల్ దేవ్‌ధర్‌ తదితరులు ఉన్నారు.

Source: Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఆమెను కలిసి తమ సమస్యలు విన్నవించారు.

Source: Eenadu

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనతో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ వ్యక్తి తన చెవులకు ఐదు రింగులను ధరించి వైవిధ్యంగా కనిపించాడు.

Source: Eenadu

మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ వద్ద బస్తీలో పర్యటించారు.

Source: Eenadu

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఇతర నేతలు విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలిపారు. అంతకు ముందు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన లోకేశ్‌ను పోలీసులు అడ్డుకొని జేఆర్‌పురం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Source: Eenadu

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్ పోటీల్లో నిజామాబాద్‌కు చెందిన మహ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆదివారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో ఘనంగా సన్మానించారు.

Source: Eenadu

మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినం సందర్భంగా గద్వాలలోని ఆయన ఫ్యాన్స్‌ 400 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో భారీ చిరంజీవి చిత్రాన్ని తీర్చిదిద్దారు. 30క్వింటాళ్ల ఉప్పు, రంగులద్దిన లవంగాలతో ఈ చిత్రాన్ని వేశారు. 

Source: Eenadu

మిసిసిపీ రాజధాని జాక్సన్‌లో మిసిసిపీ బుక్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ భారీ పుస్తకం నమూనాను ప్రదర్శనకు ఉంచారు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home