చిత్రం చెప్పే విశేషాలు!
(22-08-2022/1)
పురాణాల్లో పుష్పక విమానం కాదు.. ఇది ఫాంహౌస్‌లోని బండరాయిపై నిర్మించిన పక్కా భవనం. మేడ్చల్ జిల్లా యాడారం శివారులో ఓ రైతు తన వ్యవయసాయ క్షేత్రంలో బండరాయిపై పిల్లర్లు వేసి తన ఫాంహౌజు నలుమూలలూ కనిపించేలా భవనం నిర్మించుకున్నారు.
Source: Eenadu
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద.
Source: Eenadu
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో రద్దీ ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ త్వరలో నగర శివారు ఆదిభట్ల పురపాలిక పరిధిలోని కొంగరకలాన్‌కు తరలనుంది. భవన నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న బండరాళ్లను కదిలించకుండా.. చుట్టూ మొక్కలు పెంచారు.
Source: Eenadu
ఐదు తరగతులున్న పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే మిగిలారు.. ఇదీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. ఉన్న నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇంటి వద్దే వంటలు చేసుకొస్తున్నారు.
Source: Eenadu
కృష్ణాజిల్లా కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద విద్యార్థులు జాతీయ రహదారి మధ్యలో ఉన్న బారికేడ్లను ప్రమాదకరంగా దూకుతున్నారు. హైవేలో వాహనాలు వేగంగా వస్తున్నా పట్టించుకోకుండా బారికేడ్లు దాటుతున్నారు. వీరి కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసినా వాడుకోవడం లేదు.
Source: Eenadu
గుంటూరు బుడంపాడుకు చెందిన పోలేశ్వరరావు అనే రైతు తన మిద్దెపైన 60కి పైగా ఒకే కుటుంబానికి చెందిన రకరకాల మొక్కలను అంటుకట్టి సఫలమయ్యారు. రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్‌ను కలిపి అంటుకట్టి వినూత్న మొక్కలను ఆవిష్కరించారు.
Source: Eenadu
సీతానగరం గోదావరి వరద నీటి ప్రవాహం నిలకడగానే కొనసాగుతోంది. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద నదీ తీరం కోతకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Source: Eenadu
పత్తి మొక్కలకు హాని కలగకుండా కలుపు మందు పిచికారీకి ఒక్కో రైతు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ రైతు గోతాం పట్టాలతో చిన్న ఫ్రేం తయారు చేసి.. దాన్ని ఒకరు లాగుతుంటే మరొకరు ఫ్రేం మధ్యలో కలుపు మందు పిచికారీ చేస్తున్నారు.
Source: Eenadu