చిత్రం చెప్పే విశేషాలు..

(24-08-2022/2)

కరీంనగర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష చేపట్టారు. తెరాస ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతోందని భాజపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని తన నివాసం వద్ద సంజయ్‌ నిరసన దీక్షకు దిగారు.

Source: Eenadu

ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో రూ.1.29కోట్ల విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేశారు. మొత్తం 61,235 మద్యం సీసాలు, 8,270.82 లీటర్ల నాటుసారాను ఒకచోట ఉంచి పొక్లెయినర్‌తో తొక్కించారు.

Source: Eenadu

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో కొండ పైకి వెళ్లే ప్రవేశ మార్గం అలిపిరి చెక్‌ పాయింట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. సుమారు అరగంటకు పైగా ఇక్కడ వేచి చూడాల్సి వస్తోంది.

Source: Eenadu

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నూతన ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసానికి వెళ్లి.. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు.

Source: Eenadu

మ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’ సినిమాను సెప్టెంబర్‌ 23న తిరిగి థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అవతార్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. మరోవైపు దీని సీక్వెల్‌ ‘అవతార్‌ 2’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eenadu

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత నిఖత్‌ జరీన్‌ బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కవిత.. నిఖత్‌ జరీన్‌ను సన్మానించి అభినందించారు.

Source: Eenadu

బొలీవియాలోని లా పాజ్‌లో కోకా లీఫ్‌ మార్కెట్‌ వద్ద నాలుగు వారాలుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ రైతు టియర్‌ గ్యాస్‌ క్యాన్‌ను పోలీసులపై ప్రయోగిస్తూ కనిపించాడు.

Source: Eenadu

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం వైఎస్‌ జగన్‌ దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. సుబ్బారెడ్డి సతీమణి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ భావోద్వేగానికి గురవడంతో సీఎం జగన్‌ ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home