చిత్రం చెప్పే విశేషాలు..!

(28-08-2022/2)

తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్‌ రాత పరీక్ష నిర్వహించారు. పలువురు మహిళా అభ్యర్థులు చంటి బిడ్డలతో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల వద్ద కనిపించిన దృశ్యమిది.

Source: Eenadu

హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, మరో పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను.. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. హైదరాబాద్ రాంనగర్‌లోని తన నివాసంలో వారిని ఆయన సన్మానించారు.

Source: Eenadu

హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్ల ఓఆర్‌ఆర్‌ వద్ద ఏర్పాటు చేసిన బుద్ధుడి రూపం ఇది. విగ్రహంలో తల, చేతులు రూపొందించి.. మిగతా భాగాన్ని తీగ జాతి మొక్కలతో అందంగా అల్లిక చేశారు. అటుగా వెళ్లే చూపరులను ఈ విగ్రహం ఎంతగానో ఆకర్షిస్తోంది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘యోగా నమామి’ కార్యక్రమంలో 126 ఏళ్ల స్వామి శివానంద యోగా ప్రదర్శన ఇచ్చారు. 2022 సంవత్సరానికి గాను యోగా గురువు స్వామి శివానంద పద్మశ్రీ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే.

Source: Eenadu

హైదరాబాద్‌లో 10కె రన్‌ నిర్వహించారు. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన ఈ పరుగులో వేలాది మంది నగర ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ పాల్గొని రన్నర్లను ఉత్సాహ పరిచారు.

Source: Eenadu

వినాయక చవితి సందర్భంగా మార్కెట్లోకి విభిన్న రకాల గణేశుడి విగ్రహాలు వచ్చేశాయి. అందులో ‘RRR’ చిత్రంలోని రామ్-భీమ్‌ పాత్రలను పోలిన ఈ వినాయకుడి విగ్రహాల చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Source: Eenadu

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు 20ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. 200 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువు 15ఏళ్లకు పైగా చుక్క నీరు లేకుండా వెలవెలబోయింది.

Source: Eenadu

నోయిడాలో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను అధికారులు ఎట్టకేలకు కూల్చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు నేలమట్టం చేశారు. పేలుళ్లను ప్రారంభించిన క్షణాల వ్యవధిలోనే భవనం నామరూపాల్లేకుండా పోయింది.

Source: Eenadu

ఒలెక్సాండర్‌ అనే వ్యక్తి తన ప్రేయసి కేతరీనాకు ఉక్రెయిన్‌లోని లివీవ్‌లో ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను ఇస్తూ కనిపించాడు. యుద్ధం కారణంగా పోలండ్‌ వెళ్లిన కేతరీనా ఆరు నెలల ఎడబాటు తర్వాత స్వదేశానికి వచ్చి తన ప్రియుడిని కలిసింది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ కేంద్రాన్ని(క్లినిక్‌) ప్రారంభించారు. కార్యక్రమంలో మిస్ ఇండియా-2021 మానస వారణాసి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నది తీరంలో ఇళ్లు నీటమునిగాయి.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home