చిత్రం చెప్పే విశేషాలు..!

(29-08-2022/2)

విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అమరావతి రైతులు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో భేటీ అయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే పోరాటానికి భాజపా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Source: Eenadu

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం హాకీ స్టిక్‌ పట్టి కాసేపు ఆడారు. అక్కడే హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌లోని ఓ ప్రాంతంలో రష్యన్‌ సైనికుడు పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులను ప్రయోగిస్తూ కనిపించాడు.

Source: Eenadu

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. అరుదైన ఈ చిత్రాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

సురినామ్‌ దేశ రాజధాని పరమరిబోలోని మహాత్మా గాంధీ విగ్రహానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలకు గుర్తుగా ఈ ఆఫ్రికా దేశస్థులు భారత్‌ నుంచి గాంధీ విగ్రహాన్ని తెచ్చారు.

Source: Eenadu

సినీ నటుడు సాయితేజ్‌ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో అచ్చమ్మ పేరంటాల తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Source: Eenadu

భారత దిగ్గజ సినీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని మారఖమ్ నగరంలో ఓ వీధికి రెహమాన్‌ పేరు పెట్టారు. తన పేరు పెట్టిన మారఖమ్ నగరానికి, అక్కడి మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టీకి రెహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి, దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు..

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home