చిత్రం చెప్పే విశేషాలు!

(29-07-2022/1)

బుట్ట కదులుతుందనుకుంటే పొరపాటు పడ్డట్లే.. మేకలు, గొర్రె పిల్లల రక్షణకు ఉపయోగించే వెదురు బుట్టను ద్విచక్రవాహనంపై ఇలా తరలిస్తున్నారు. జగిత్యాలలో గురువారం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై బుట్టను ప్రమాదకరంగా తరలిస్తున్న దృశ్యం.

Image: Eenadu

మిషన్‌ భగీరథ నీటి సరఫరాను పక్కాగా లెక్కించేందుకు కుమురం భీం జిల్లా వ్యాప్తంగా సౌర శక్తితో పనిచేసే ఫ్లో మీటర్లను అధికారులు అమర్చారు. ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లో మీటర్‌ను చిత్రంలో చూడవచ్చు.

Image: Eenadu

శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య సంబరాలను కుమురం భీం జిల్లాలోని ఆదివాసీ గ్రామాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. వెదురు బొంగులతో మరుగోళ్లను(గోండి భాషలో కోడంగ్‌) తయారు చేసి వాటిపై చిన్నారులు నడుస్తూ సందడి చేశారు.

Image: Eenadu

నీళ్లు రావటం లేదని 15 ఏళ్ల కిందట వదిలేసిన బోరు నుంచి నీళ్లు పొంగి బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖమ్మం జిల్లా ఊట్లపల్లి సమీపంలోని బేతి రాముడు అనే గిరిజన రైతు పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Image: Eenadu

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 1050 మంది చదువుతున్నారు. వీరికి 11 గదులు ఉన్నాయి. ఇవి చాలకపోవడంతో 8, 9 తరగతుల విద్యార్థినులకు చెట్ల కింద, ఆడిటోరియం, వరండాల్లో పాఠాలు బోధించాల్సి వస్తోంది.

Image: Eenadu

అనంతపురం జిల్లా కశింకోట మండలం సుందరయ్యపేట శివారు ఆనందపురం పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థితో పాఠశాల నడుస్తోంది. ఈ బడికి ఉన్నత పాఠశాల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో విలీనం చేయలేదు.

Image: Eenadu

మన్యం అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండపై మంచు సోయగాలు ఆకట్టుకుంటున్నాయి.

Image: Eenadu

రహదారి పక్కనే విక్రయాలు చేసే చిరువ్యాపారులు జనాన్ని ఆకట్టుకునేందుకు పలు విన్యాసాలు చేస్తున్నారు. తాటిబెల్లం విక్రయించేవారు ఇలా పొన్నూరు రహదారి పక్కనే జనాలకు తెలిసేలా చెట్లకు బుట్టలు కట్టి పెడుతున్నారు.

Image: Eenadu

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి మూల విరాట్‌కు వజ్రకిరీటం సిద్ధమైంది. పెద్దాపురానికి చెందిన వ్యాపారవేత్త మట్టే సత్యప్రసాద్‌ దీన్ని తయారు చేయించారు. 682 గ్రాముల బంగారంతో రూపొందించారు. కిరీటానికి సుమారు 98 శాతం వజ్రాలు పొదిగారు.

Image: Eenadu

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో రాతి ఎడారి ప్రాంతంగా పేరొందిన పుజైరాలో భారీ వర్షం కురిసింది. దీంతో గురువారం ఇక్కడ వరద పోటెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్లు నీట మునిగాయి.

Image: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home