చిత్రం చెప్పే విశేషాలు..!
(30-07-2022/1)
కనకదుర్గ వారధి నుంచి యనమలకుదురు రామలింగేశ్వరనగర్ వరకు నిర్మాణంలో ఉన్న రిటైనింగ్‌వాల్ పై స్థానికంగా ఉండే చిన్నారులు కొంతమంది ఎక్కి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. కృష్ణానది వరదనీటిని చూడటం కోసం ఎతైన గోడను ఎక్కి చూస్తున్నారు.
Image: Eenadu
నో పార్కింగ్ జోన్ వద్ద వాహనం నిలిపితే వెంటనే జరిమానా విధించే పోలీసులే విజయవాడలో నిబంధనలు ఉల్లంఘించి 13 వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఒక రూల్ మాకు ఒక రూలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Image: Eenadu
పచ్చగా కళకళలాడుతోన్న ఈ ప్రదేశాన్ని చూసి ఏదో పంట అనుకుంటే పొరబడినట్లే! ఇది మురుగు కుంట. దానిపై గుర్రపుడెక్క పెరిగి ఇలా కనిపిస్తోంది. కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో ఉన్న ఈ కుంటలోకి స్థానిక ఇళ్లలోని మురుగు, వర్షం నీరు చేరుతోంది.
Image: Eenadu
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న వాహనాలు ఇవి. ఆదోని ఎక్సైజ్‌శాఖ వారు వివిధ కేసుల్లో వీటిని పట్టుకున్నారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా అన్నీ కలిపి 363 ఉన్నాయి.
Image: Eenadu
శ్రావణమాసం తొలి శుక్రవారం బలగ నాగావళి నదీ తీరంలోని బాలత్రిపుర కాళభైరవాలయంలో అమ్మవారికి లక్ష గాజులతో అర్చన, అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Image: Eenadu
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన రైతు ఏడెల్లి సత్యనారాయణరెడ్డి తన పొలంలో డ్రోన్‌తో క్రిమి సంహారక మందు పిచికారీ చేయించారు. శుక్రవారం ఎకరానికి రూ.500 అద్దె చెల్లించగా పది నిమిషాల్లో పని పూర్తి చేశారు.
Image: Eenadu
తల్లిదండ్రులు తెలిసి తెలిసి చిన్నారులను ప్రమాదాల వైపు నెట్టేస్తున్నారు. కోదాడ-రాయచూరు 167వ నంబరు జాతీయ రహదారిపై నలుగురు చిన్నారులు ఓ మోపెడ్‌పై భారీ వాహనాల నడుమ ప్రయాణిస్తూ కనిపించారు.
Image: Eenadu
బోధన్ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై బల్దియా కార్మికుడు బల్జీత్‌సింగ్ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ రహదారి వెంట భుజంపై అవగాహన నినాదాల ప్లకార్డు, ఒక మైక్ సెట్ పట్టుకొని, హెల్మెట్ ధరించి ప్రచారం చేస్తున్నారు.
Image: Eenadu
రష్యాపై పోరులో గాయపడి ఒడెసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికుడిని పరామర్శించి.. సెల్ఫీ దిగుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.
Image: Eenadu