చిత్రం చెప్పే విశేషాలు!
(08-08-2022/2)
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
Source: Eenadu
హైదరాబాద్ మణికొండలో కె.ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు చెందిన హోటల్ కాస్టల్‌ను యువ కథానాయకుడు నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ ఆయన సందడి చేశారు.
Source: Eenadu
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆరో రోజుకు చేరింది. శేరిల్లి, పెద్ద కొండూరు, చిన్న కొండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీ మీదుగా తాళ్ల సింగారం క్రాస్ రోడ్ వరకు ఆయన యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Source: Eenadu
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో బార్బేక్యూనేషన్ నూతన రెస్టారెంట్‌ను బిగ్ బాస్ ఫేం, సినీనటి హిమజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సరికొత్త రుచులను ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
Source: Eenadu
నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతపల్లె కోటేశ్ కాఫీ పొడితో భరతమాత చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 375 మంది స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖుల చిత్రాలను పొందుపర్చారు.
Source: Eenadu
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.
Source: Eenadu
కామన్వెల్త్‌లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా సంబరాలకు సంబంధించిన ఫొటోను స్మృతీ మంధాన తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సమరయోధుల చిత్రాలను ఆమె తిలకించారు.
Source: Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏలూరు జిల్లాలోని దెందులూరులో బచ్చు రాంబొట్లు, ధనలక్ష్మి నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో 106 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
Source: Eenadu
కరేబియన్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ కృనాల్ పాండ్య వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కృనాల్ పాండ్య.. మిత్రులు కుటుంబం వంటి వారని తెలుపుతూ పోస్టు పెట్టారు.
Source: Eenadu