చిత్రం చెప్పే విశేషాలు!

(01-09-2022/2)

ఆస్ట్రేలియాలో ‘పిచ్‌బ్లాక్‌ 22’ ప్రదర్శనలో భాగంగా వివిధ దేశాలు సంయుక్త వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొన్న భారత వైమానిక దళం యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి..

Source: Eenadu

మనీలాలోని జపనీస్‌ ఎంబసీ ఎదుట పలువురు మెరైన్‌ వైల్డ్‌ లైఫ్‌ అడ్వకేట్స్‌ వినూత్నంగా డాల్ఫిన్‌ తలలను పోలిన టోపీలను ధరించి నిరసన తెలిపారు. డాల్ఫిన్ల మృతికి కారణమయ్యే ఫిషరీస్‌ డ్రైవ్‌ను జపాన్‌లోని తైజీలో పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ కార్యక్రమం చేపట్టారు.

Source: Eenadu

పాకిస్థాన్‌ సింధు ప్రావిన్స్‌లోని శికర్‌పుర్‌ జిల్లాలో వరదలకు ఇల్లు కూలిపోవడంతో ఓ వ్యక్తి తన సామగ్రిని వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Source: Eenadu

పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం పవర్ గ్లాన్స్‌ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టింది.

Source: Eenadu

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గురువారం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌.. క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘ప్రజలు, ప్రాంతాలు, జ్ఞాపకాలు, బ్లర్రుడ్‌ ఫొటోలు’ అని పోస్టు పెట్టారు.

Source: Eenadu

విశాఖపట్నంలోని ఏబీఎన్‌ కళాశాల సమీప కోడిపందాల వీధిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులు అందిస్తున్న రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home