చిత్రం చెప్పే విశేషాలు..!

(02-09-2022/1)

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ గుండుపిన్నుపై 3 మిల్లీ మీటర్ల పొడవు, 2.5 మి.మీ వెడల్పుతో పసుపు గణపతిని తయారు చేశారు. ఇందుకోసం 11 గంటల పాటు శ్రమించారు.

Source: Eenadu

బకాయిలు చెల్లించలేదని వంట ఏజెన్సీ సిబ్బంది రాకపోవడంతో ఉపాధ్యాయులే వంట మనుషుల అవతారం ఎత్తి విద్యార్థుల ఆకలి తీర్చారు. ఈ ఘటన ఇటిక్యాల మండలం వల్లూరులో చోటు చేసుకుంది.

Source: Eenadu

విశాఖపట్నం సీతంపేటకు చెందిన రామకృష్ణ తోపుడుబండి వ్యాపారి. తను పెద్ద సంఖ్యలో కొని... అమ్మకానికి తెచ్చిన ‘బొప్పాయి’లను బండిపై పోసినప్పుడు ఒకటి ‘గుమ్మడి కాయ’ ఆకారంలో కనిపించింది. దీంతో పండిన ఆ బొప్పాయిని ఆకట్టుకునేలా బండిపై ప్రదర్శనగా ఉంచారు.

Source: Eenadu

దక్షిణ పసిఫిక్‌ ఫిజీ దేశం సువా తీరానికి ఐఎన్‌ఎస్‌ సాత్పురా నౌక చేరుకుందని గురువారం తూర్పునావికాదళ వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి నౌక సందర్శన ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాయి.

Source: Eenadu

విశాఖలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో భూగర్భంలో అమర్చే కేబుల్స్‌ కోసం ఎక్కడికక్కడ తవ్వుతున్న గోతుల్ని పూర్తిస్థాయిలో పూడ్చకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి గాజువాక మున్సిపల్‌ రోడ్డులో దిగబడిపోయింది.

Source: Eenadu

విజయనగరంలోని హుకుంపేటలో 25 శిరస్సులతో ఉన్న గణనాథుడ్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిమను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని రామచంద్రాపురం బీరంగూడ కమాన్‌, లింగంపల్లి కూడలి శ్వేతా గార్డెన్‌ సమీపాల్లో గురువారం తెల్లవారుజామున మంజీరా తాగునీటి పైపులైన్‌లు రెండు ప్రాంతాల్లో పగలడంతో ఆరు గంటలపాటు తాగునీరు రోడ్ల పాలైంది.

Source: Eenadu

నిమ్స్‌ ఆసుపత్రిలో గురువారం ఉదయం కనిపించిన చిత్రమిది. కరీంనగర్‌కు చెందిన 80 ఏళ్ల లక్ష్మయ్యకు మూత్రపిండాల వ్యాధి ఉంది. చికిత్స కోసం ఇక్కడికి వచ్చారు. దంపతులిద్దరూ వృద్ధులే కావడంతో నడవడానికి నానా ఇబ్బందులు పడ్డారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home