చిత్రం చెప్పే విశేషాలు!
(11-09-2022/2)
జర్మనీలో ఈ ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయిస్తున్న సూర్యుడి చుట్టూ దండ ఆకారంలో ఎగురుతున్నాయా అన్నట్లు కొన్ని పక్షులు కనువిందు చేశాయి. ఈ ప్రకృతి వింతను పలువురు తమ కెమెరాల్లో బంధించారు.
Source: Eenadu
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనపూర్ గ్రామంలో పర్యటించారు. అక్కడ మొక్కజొన్న కంకులు కాల్చి జీవనోపాధి పొందే మహిళలతో ఆమె ముచ్చటించారు.
Source: Eenadu
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భేటీ అయ్యారు. దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు.
Source: Eenadu
హైదర్‌గూడలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పింఛన్ల పంపిణీ చేశారు. ఇందులో హిమాయత్‌నగర్‌కు చెందిన మహిళ తొలిసారిగా ఒంటరి మహిళ పింఛను అందుకొని ఆనందంతో కంటతడి పెట్టింది. ఆమె ఇద్దరు కుమార్తెల చదువు బాధ్యతను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Source: Eenadu
వరుసగా నాలుగు రోజులుగా వర్షాలు కురవడంతో పిచ్చుక గూళ్లు తడిసిపోయాయి. దీంతో అందులో ఉండలేక ఇళ్ల మధ్య గూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో గూడు ఏర్పాటు చేసుకోవడానికి గడ్డి పోచను తీసుకువస్తున్న పక్షి జంటను చిత్రంలో చూడవచ్చు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో చిలక గూటిపై గోరింకలు వాలాయి. వెంటనే వేగంగా వచ్చిన చిలక వాటిని తరిమింది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ‘సూత్ర దీపావళి ఎగ్జిబిషన్’కు సంబంధించిన కర్టెన్‌రైజర్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఓ మహిళ.. తన చిన్నారి వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకుంది. కానీ ఆ బాలుడు గొడుగుపై నుంచి జాలువారుతున్న చినుకులతో ఆడుకుంటూ సంబరపడ్డాడు.
Source: Eenadu