చిత్రం చెప్పే విశేషాలు..!

(12-09-2022/2)

ఏపీ రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు. వెంకటపాలెంలోని తితిదే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న వేంకటేశ్వర స్వామి రథాన్ని నడిపి అంకురార్పణ చేశారు.

Source: Eenadu

నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గాజులరామారంలోని చిత్తారమ్మ దేవాలయంలో పూజలు చేశారు.

Source: Eenadu

నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌లోని సూరారంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభకు వస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంయ్‌కి భారీ తులసి మాలతో స్వాగతం పలికారు.

Source: Eenadu

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సుమారు 800ఏళ్ల వయసు గల పిల్లల మర్రిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ సందర్శించారు. చెట్టు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

Source: Eenadu

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి చరిత్రను భావితరాలకు తెలిసేలా హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్మిస్తున్న అమరుల స్మృతి చిహ్నం పనులు వేగంగా సాగుతున్నాయి. దీన్ని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లోహంతో దీపం ఆకారంలో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

Source: Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం వెంకటగిరి గ్రామంలో మహిళా రైతులతో కలిసి ఆమె పొలంలో పత్తి ఏరారు.

Source: Eenadu

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, ఆయన సతీమణి అనుష్కశర్మ టీ తాగుతూ.. కబుర్లు చెప్పుకొంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్కశర్మ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఆదివారం భువనేశ్వర్‌ విమానాశ్రయం ఆవరణలో గజరాజుల సైకత శిల్పం తీర్చిదిద్దారు. ఏనుగులు మానవాళికి స్నేహితులని, ఈ వన్యప్రాణులను కాపాడుదామని సందేశమిచ్చారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home