చిత్రం చెప్పే విశేషాలు..!

(13-09-2022/1)

విశాఖ నగర పోలీసుశాఖ విభాగం డాగ్‌ స్క్వాడ్‌లో ట్రాకర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన 13 సంవత్సరాల రాణా(శునకం) మృతిచెందింది. దీంతో రాణాకు ఎ.ఆర్‌. సిబ్బంది తమ జాగిలాలతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు.

Source: Eenadu

స్విట్జర్లాండ్‌లోని క్లొటెన్‌లో ఏర్పాటు చేసిన నాసా అంతరిక్షనౌక నమూనా. గుమ్మడికాయలతో తయారు చేసిన ఈ బొమ్మ సందర్శకులను ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఎలిజబెత్‌-2 వర్ణ చిత్రం. భారీ సంఖ్యలో ప్రజలున్న వందల ఫొటోల సమ్మేళనంతో చిత్రకారిణి హెలెన్‌మార్షల్‌ దీన్ని రూపొందించారు.

Source: Eenadu

శ్రమజీవులైన చీమలు.. వాటి నివాసం కోసం పుట్టను తయారు చేస్తున్న క్రమంలో ఓ చోట అచ్చం చాయ్‌ కప్‌ లాంటి ఆకారాన్ని తయారు చేశాయి. పెంచికల్‌పేట్-బొంబాయిగూడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సమీప అటవీ ప్రాంతంలో కనిపించిందీ దృశ్యం.

Source: Eenadu

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కుతోంది. పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

కాంక్రీట్‌మయంగా మారుతున్న నగరంలో నీటి పొదుపు అవసరాన్ని తెలియజేస్తూ లక్డీకాపూల్‌లో చేతిలో నీటి బిందువు ఉన్నట్లు బొమ్మ ఏర్పాటు చేశారు. గణపయ్య నిమజ్జనం అనంతరం తిరిగివెళ్తూ బాలికలు బొమ్మ వద్ద ఫొటోలు దిగి సందడి చేశారు.

Source: Eenadu

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఇస్తారుపల్లి రోడ్డు భారీ వర్షాలకు తెగిపోగా నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామాల ప్రజలు సాహసం చేసి మరీ దాటుతున్నారు. రెండు నెలల్లో మూడుసార్లు రోడ్డు తెగిపోవడంతో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Source: Eenadu

కేశవపట్నం నుంచి పాపయ్యపల్లికి వెళ్లే లో లెవల్‌ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు వెళ్లకుండా ఎండిన చెట్టును వంతెనపై అడ్డుగా ఉంచారు. కాచాపూర్‌ ఊర చెరువు మత్తడి కోతకు గురైంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home