చిత్రం చెప్పే విశేషాలు...!

(13-09-2022/2)

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలంలో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. మధ్యాహ్నం 12 గంటలకు 50.9అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా.. 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Source: Eenadu

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు.

Source: Eenadu

తెలుగుదేశం పార్టీ, మహిళా నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.

Source: Eenadu

ఆసియా కప్‌ దక్కించుకున్న శ్రీలంక ఆటగాళ్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో క్రికెటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్‌ బస్సుపై కూర్చోబెట్టి ఊరేగించారు.

Source: Eenadu

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగుతోంది. భాజపా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు యాత్రలో పాల్గొని బండి సంజయ్‌కు సంఘీభావం తెలిపారు.

Source: Eenadu

ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో నటి రెజీనా కసాండ్ర పాల్గొన్నారు. నటి ప్రగ్యా జైస్వాల్‌ విసిరిన ఛాలెంజ్‌ మేరకు రెజీనా మొక్కలు నాటారు.

Source: Eenadu

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో సేలని వెల్ఫేర్‌ ట్రస్టు సభ్యులు పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితులు ఇలా క్యూలో నిల్చున్నారు. అక్కడ గత మూడు నెలల్లో సంభవించిన అసాధారణ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Source: Eenadu

ఫ్రాన్స్‌లోని సౌమోస్‌ గ్రామ సమీపంలో భారీ కార్చిచ్చు రేగింది. దాదాపు వెయ్యి హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు స్థానికుల్ని నివాసాల నుంచి ఖాళీ చేయించారు. అగ్ని కీలలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక బృందాలు శ్రమిస్తున్నాయి.

Source: Eenadu

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ‘థార్‌ మార్.. థక్కర్‌ మోర్‌’ అంటూ స్టెప్పులేసిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home