చిత్రం చెప్పే విశేషాలు..!

(15-09-2022/1)

నిత్యం విద్యార్థులు సంచరించే ప్రాంతం.. పైగా వర్షాకాలం.. ఎంత నిర్లక్ష్యంగా విద్యుత్తు వైర్లను వదిలేశారో చూడండి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాదబాటపై కనిపించిందీ దృశ్యం.

Source: Eenadu

సైబర్‌ టవర్స్‌ సిగ్నల్‌ కూడలిలో శిల్పారామం వైపు రహదారికి అటూఇటూ ఉన్న కొద్దిపాటి స్థలంలో పాదచారులు కూర్చునేందుకు వీలుగా వివిధ ఆకృతుల్లో సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు ఇక్కడ కొద్దిసేపు సేదతీరుతున్నారు.

Source: Eenadu

ఆంధ్ర-తెలంగాణ అత్యవసర అంబులెన్స్‌లు సరిహద్దులో పక్క పక్కకొచ్చాయి. గోదావరి వరదల దృష్ట్యా జ్వరాలతో బాధ పడుతున్న గిరిజనానికి మేమున్నామంటూ రోగులను తరలిస్తున్న వాహనాలు సరిహద్దులోని ఎటపాక-భద్రాచలం మార్గ మధ్యలో కలిసిన చిత్రమిది.

Source: Eenadu

బూర్గంపాడు పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ ఇంటిపై పులిబొమ్మను ఏర్పాటు చేశారు. కోతుల బెడద నుంచి నివారించేందుకు ఇంటిపై పులి బొమ్మను పెట్టినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ రీజియన్‌ లిజియుంలో రష్యా బాంబు దాడుల కారణంగా పొలాల్లో ఏర్పడిన గుంతలు ఇవి. దాడులు జరిగిన కొద్దిరోజులకు పచ్చిక మొలవడంతో ఈ ప్రాంతమంతా ఇలా ప్రత్యేక రూపు సంతరించుకుంది..

Source: Eenadu

పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఆదర్శ పాఠశాలలో బుధవారం నిర్వహించిన హిందీ దివస్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సందడి చేశారు. హిందీ అక్షరాల రూపంలో కూర్చుని అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ రఘుపాత్రుని శివకుమార్‌ పాల్గొన్నారు.

Source: Eenadu

శ్రీకాకుళం జిల్లా ఇద్దివానిపాలెం తీరంలో సముద్రం రంగుమారింది. ఎగువ ప్రాంతాల్లో వరద, బీలబట్టి నీరు అధిక మొత్తంలో సముద్రంలో కలవడంతో ఇలా రంగుమారిందని, మరో రెండు రోజులపాటు ఇలాగే ఉంటుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

Source: Eenadu

బిహార్‌లోని కటిహార్‌ రైల్వేస్టేషన్‌లో ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్‌ అందుబాటులోకి తెచ్చిన రైలు బోగీ రెస్టారెంట్‌ ఇది. పాత రైలు పెట్టెకు కొత్తగా రంగులు వేయడంతో పాటు మంచి బల్లలు, కుర్చీలు, ఏసీలు, లైట్లు ఏర్పాటు చేసి దీనికి కొత్తరూపు తెచ్చారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home