చిత్రం చెప్పే విశేషాలు!

(19-09-2022/1)

చెట్లు, పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం రాజధాని అమరావతిలోని అంబేడ్కర్‌ స్మృతివనం. ప్రభుత్వం మారడంతో రాజధానిలో నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్మృతివనంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ ముళ్లపొదలు అల్లుకున్నాయి.

Source: Eenadu

తేనెతుట్టెలు అడవుల్లోని ఎత్తయిన చెట్లకు, కొండలకు వేలాడుతూ కనిపిస్తుంటాయి. కానీ, ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన కేతినేని సూరిబాబు ఇంట్లోనే పెట్టిన ఓ పొడవాటి తేనెతుట్టె చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.

Source: Eenadu

సెలవులు, వారాంతాల్లో వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లో విహరించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. నంది, శివలింగ వద్ద సందర్శకులు రాళ్లను పేర్చి మొక్కు తీర్చాలని కోరుకుంటుంటారు. దీంతో శివలింగం వద్ద రాళ్లు ఇలా పేరుకుపోయాయి. 

Source: Eenadu

ఇంతవరకు గోదావరి ముంపులో ఉన్న పొలాలు, భూముల్లో వరద తగ్గడంతో సాగులోకి వచ్చాయి. పొలాల్లో డ్రిప్‌ పైపులు అమర్చి, వాటిపై మల్చింగ్‌ షీట్‌లు పరదాల్లా పరిచారు.

Source: Eenadu

ఆంధ్రాకశ్మీర్‌ లంబసింగితోపాటు చెరువులవెనం, తాజంగి పర్యటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. దూరప్రాంతాల నుంచి పర్యటకులు ఇక్కడకు వచ్చారు. తాజంగి జలాశయం వద్ద ఉన్న జిప్‌లైనర్‌పై పర్యటకులు సందడి చేశారు. 

Source: Eenadu

చింతూరు మండలం సుకుమామిడి వద్ద మరో జలపాతం వెలుగుచూసింది. సుకుమామిడి అభయారణ్యంలోని దట్టమైన కొండపై నుంచి పాలనురగ లాంటి జలధార కిందకు జాలువారుతుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించటం కష్టమంటున్నారు చూపరులు. 

Source: Eenadu

మారేడుమిల్లి - చింతూరు మధ్యలో ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం పర్యటకులకు మధురానుభూతి పంచుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండలు పచ్చగా కళకళలాడుతుంటే వాటిపై పరుచుకుంటున్న తెల్లటి మేఘాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

Source: Eenadu

దసరా సమీపిస్తున్నా ఇప్పటివరకు దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేయలేదు. పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్లలో కొన్నిచోట్ల మెట్లు ధ్వంసమైపోయాయి. త్వరితగతిన ఘాట్లకు మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home