చిత్రం చెప్పే విశేషాలు!

(01-08-2022/1)

ఏపీ రాజధాని అమరావతిలో రోడ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా లింగాయపాలెం సమీపంలో రైతుల ప్లాట్లలోకి వెళ్లేందుకు వేసిన రహదారిని తవ్వి మట్టి, కంకరను ఎత్తుకెళ్లారు.

Source: Eenadu

ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో జాతీయ జెండాల తయారీ సంస్థలు వాటిని సరఫరా చేసే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది.

Source: Eenadu

సమృద్ధిగా వానలు.. సస్యశ్యామలంగా ఉండాల్సిన కాలం.. అయినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టేకు వనాలు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. సిరికొండ మండల కేంద్రానికి సమీపంలోని గుట్టలపై టేకు వనం అంతా దాదాపు ఇలా రంగు మారి కనిపిస్తున్నాయి.

Source: Eenadu

ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు, ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లల్లోకి వెళుతూ ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. పిల్లలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.

Source: Eenadu

ఇటీవల ఫొటోషూట్‌లతో పెళ్లి పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే పేకముక్కలపై సైతం ఎవరి పెళ్లికి వచ్చామో గుర్తుండిపోయేలా ఇలా వధూవరుల చిత్రాలు ముద్రించారు. విజయవాడలో ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఫొటోకార్నివాల్‌లో కనిపించిన చిత్రాలివి.

Source: Eenadu

ఇది కాలువ కాదు.. దివాన్‌చెరువు- శ్రీరాంపురం ప్రధాన రహదారి. ఈ గ్రామాల మధ్య రహదారి విస్తరణ పనులు నెలల కొద్దీ కొనసాగుతున్నాయి. వర్షం కురిస్తే చాలు గోతులేవో, రోడ్డు ఏదో తెలియని పరిస్థితి. ఆదివారం ముంపునీటిలో వెళ్తున్న ఒక ఆటో గోతిలో పక్కకు ఒరిగి పోయింది.

Source: Eenadu

సామర్లకోట - పిఠాపురం రోడ్డులో రెండేళ్లుగా ఏలేరు చిన్న వంతెన పనులు జరుగుతున్నాయి. ఈ పనులు సకాలంలో పూర్తికాక నిత్యం ప్రయాణికులకు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. తాత్కాలిక రోడ్డు వర్షాకాలంలో వరద నీటికి కొట్టుకుపోతోంది.

Source: Eenadu

ఆత్రేయపురం మండలం ఉచ్చిలికి చెందిన భూపతిరాజు వెంకట సత్య సుబ్బరాజు తన చేలో వేసిన ‘ప్రేయింగ్‌ హేండ్స్‌’ అనే కొత్త రకం అరటి అందరినీ అబ్బురపరుస్తోంది. ఈ రకం అరటి శుభకార్యాల్లో ఆకర్షణగా ఉంటుందని అలంకరణకు వినియోగిస్తారని రైతు తెలిపారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home