చిత్రం చెప్పే విశేషాలు!
(01-08-2022/2)
తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునః ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని తితిదే నిలిపివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నేటి నుంచి కళాకారుల ప్రదర్శనకు అవకాశం కల్పించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
Source: Eenadu
హైదరాబాద్ మహా నగరంలో వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద ఈ విధమైన రద్దీ కనిపించింది.
Source: Eenadu
హైదరాబాద్ నగరంలోని పార్క్‌హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ను యువ కథానాయిక శాన్వీ మేఘన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ ఆమె సందడి చేశారు.
Source: Eenadu
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోని చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్‌భవన్ హైస్కూల్ విద్యార్థులకు మువ్వన్నెల జెండాలను పంపిణీ చేశారు.
Source: Eenadu
చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నృత్య నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
Source: Eenadu
‘గాడ్ ఫాదర్’ సినిమా సెట్‌లో ఉన్న ప్రముఖ నటులు చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ను.. లైగర్ సినిమా నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, సహ నిర్మాత చార్మీ కలిశారు.
Source: Eenadu
భారీవర్షాలు కురుస్తున్నా వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వెనకాడటంలేదు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో గొడుగు పట్టుకొని చలాన్లు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసును చిత్రంలో చూడవచ్చు.
Source: Eenadu
హైదరాబాద్ నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్య జగద్గిరిగుట్ట పై నుంచి చూసినప్పుడు నగరంపై మబ్బు ముసుగు వేసినట్లు కనిపించింది.
Source: Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ నుంచి మూడు కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదురుగా విద్యార్థులు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేతబూని పరుగు తీస్తూ కనిపించారు.
Source: Eenadu