చిత్రం చెప్పే విశేషాలు..!

(09-08-2022/2)

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజుకు చేరింది. దేశం మొత్తం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయన తన యాత్రలో జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు.

Source: Eenadu

హిమాయత్ నగర్ భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో 10 వేల జాతీయ జెండాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి గడప గడపకు వెళ్లి వీటిని ప్రజలకు అందజేస్తామని ఆయన తెలిపారు.

Source: Eenadu

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలకు అర్చకులు అష్టోత్తర కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్రారోహణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల స్ఫూర్తితో సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామం నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి 75 కిలోమీటర్ల మేర పాదయాత్రను ప్రారంభించారు.

Source: Eenadu

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ నెల్లూరులో ప్రారంభమైంది. బారాషహీద్‌ దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి ఆకట్టుకున్నారు.

Source: Eenadu

భారీ వర్షాల కారణంగా ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Source: Eenadu

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం 3కె రన్‌ను ఆయన ప్రారంభించారు.

Source: Eenadu

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా 552 థియేటర్లలో ‘గాంధీ’ చిత్రం ఈ నెల 22వ తేదీ వరకు ఉచితంగా ప్రదర్శించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో ‘గాంధీ’ సినిమాను వీక్షిస్తున్న విద్యార్థులు.

Source: Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజ స్తంభానికి, శ్రీ భూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి పవిత్రమాలలు సమర్పించారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని చార్మినార్‌ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. ముస్లిం సోదరులు పీర్లను ఊరేగిస్తూ గీతాలను ఆలపించారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్‌ పీర్ల వద్ద దట్టీ సమర్పించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home