చిత్రం చెప్పే విశేషాలు..

(10-08-2022/2)

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ కోఠిలోని కేంబ్రిడ్జి పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కోఠి, రాంకోఠి, సుల్తాన్‌బజార్‌ మార్గంలో ర్యాలీ చేశారు.

Source: Eenadu

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజుకు చేరింది. మార్గమధ్యలో కల్లు గీత కార్మికులు ఆయన్ను కలిశారు. వారి కోరిక మేరకు బండి సంజయ్‌ ఇలా లొట్టిలో కల్లు తాగారు.

Source: Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి బుధవారం ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి చక్రస్నానం, ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాలను కాపాడాలని కోరుతూ ఉపరాష్ట్రపతి కార్యాలయం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో సింహాల ఫొటోలు పంచుకుంది. భారతదేశ సంప్రదాయంలో సింహాన్ని న్యాయానికి, ధైర్యానికి, వీరత్వానికి ప్రతీకగా చూస్తారని చెప్పింది.

Source: Eenadu

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం అక్కడి గాంధీ స్మృతి స్థల్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళి అర్పించారు.

Source: Eenadu

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌ బ్రహ్మకుమారీల సంస్థ ఇన్‌ఛార్జి కుల్దీప్‌ బెహన్‌జీ మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Source: Eenadu

లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటుడు విజయ్‌ దేవరకొండ గుజరాత్‌లోని వడోదర వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయ వంటకం ‘గుజరాతీ తాళీ’ని రుచి చూశారు.

Source: Eenadu

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పుల్వామాలో విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు.

Source: Eenadu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం పార్లమెంటు ఆవరణలో సీతా అశోక మొక్కను నాటారు. సీతా అశోక వృక్షాన్ని భారత దేశ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. దీనికి ఔషధ గుణాలు సైతం మెండుగా ఉన్నాయి.

Source: Eenadu

అనంతపురం జిల్లాలో ఈ ఏడాది టమాట పంట రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పతనం కావడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు టమాటలను జాతీయరహదారి పక్కనే పారబోసి వెళ్లిపోయారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home