చిత్రం చెప్పే విశేషాలు!

(20-09-2022/1)

ముఖ్యమంత్రి వెళ్లే దారిలో రోడ్డు దుస్థితి ఇది. సీఎం నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే కృష్ణా కరకట్ట మార్గంలో కొండవీటి వాగుపై ఉన్న వంతెనపై గుంతలు పడడంతో వర్షపు నీరు చేరింది. దీంతో గుంతల్లో నీటిని బకెట్లతో తోడి నదిలో పోశారు.

Source: Eenadu

అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి కుమారుడు హనుమంతరెడ్డి చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదగలేదు. పింఛను కోసం సోమవారం కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చేందుకు తండ్రి అతడిని ఇలా తీసుకువచ్చారు.

Source: Eenadu

హైదరాబాద్‌ శివారు తుర్కయాంజాల్‌ మాసాబ్‌ చెరువులో ఓ చేపను నీటిపాము నోట కరచుకొని ఒడ్డుకు చేరుతున్న దృశ్యమిది. వేటాడి పట్టుకున్న చేప జారిపోకుండా పాము తన తలను పైకెత్తి వెళుతూ కనిపించిందిలా.

Source: Eenadu

పాతబస్తీ దారుల్‌షిఫా రోడ్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించిన అధికారులు.. ఆ ప్రాంతంలో ఇలా పెద్ద డ్రమ్ములను కుండీలుగా మార్చి మొక్కలు నాటారు. అవి పచ్చగా ఎదిగినప్పటికీ పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి నిర్వహణ లేక అధ్వానంగా మారిపోయాయి.

Source: Eenadu

వర్షం కురిసినప్పుడు ఖైరతాబాద్‌ ప్రధాన రహదారి జలమయం అవుతోంది. కొన్ని రోజుల వరకు రహదారి పక్కన నీరు నిలుస్తోంది. దీంతో మురుగుగా మారి దుర్వాసన వస్తోంది. సిగ్నల్‌ పడినప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Source: Eenadu

ఇళ్లపై నీటి ట్యాంకులను విమానాల ఆకారంలో నిర్మిస్తుంటారు కొందరు. ఇది అలా చేసింది కాదు. బేగంపేట విమానాశ్రయంలో దిగే క్రమంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం వద్ద మెట్రో మార్గంపై నుంచి వెళుతుండగా ఈ చిత్రం ఆవిష్కృతమైంది.

Source: Eenadu

వడ్డేపల్లి చెరువు కట్టపై నడుస్తూ వెళ్లే వారు జలకళను చూసి ఆనందపడుతుంటారు. కాజీపేట నుంచి రామగుండం వైపు రైల్లో వెళ్లే వారు సైతం సరస్సు మధ్యలోంచి పయనిస్తూ అనుభూతి పొందుతారు.

Source: Eenadu

భూకంపం కారణంగా తైవాన్‌లోని హువాలియన్‌లో కూలిపోయిన గోలియావో వంతెన.

Source: Eenadu

హీరామండి.. అస్లీ సోనా

మలైకా.. అదిరింది యోగా!

చిత్రం చెప్పే విశేషాలు(26-04-2024/1)

Eenadu.net Home