చిత్రం చెప్పే విశేషాలు..!

(21-09-2022/1)

ఏజెన్సీ, మైదాన ప్రాంతాలను అనుసంధానించే కాకినాడ జిల్లా ఏలేశ్వరం-జె.అన్నవరం రహదారి ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఈ రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపోనకు చెందిన బస్సు గోతిలో దిగబడిపోయింది.

Source: Eenadu

అన్నవరం వాగు దాటడం గిరిజనులకు దినదినగండంగా మారుతోంది. రెండు రోజుల క్రితం వరద ఉద్ధృతికి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక తడికల వంతెన కొట్టుకుపోయింది. దీంతో మూడేళ్ల క్రితం శిథిలమైన పాత వంతెనపై రాళ్లు పేర్చుకుని ఇలా వాగు దాటుతున్నారు.

Source: Eenadu

ఇది నరసన్నపేట ఆర్టీసీ బస్సు నిలయం ఆవరణ. చిన్నపాటి వర్షం పడినా ఇలా జలమయమై చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

Source: Eenadu

పుట్టపర్తి మండలం రాయలవారిపల్లి నుంచి విద్యార్థులు చిత్రావతి నదిలో లోతైన నీటిలో ఎనుములపల్లి ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్రావతినది ఉద్ధృత ప్రవాహానికి కాజ్‌వేలు, తాత్కాలిక రహదారులు కొట్టుకుపోవడంతో గ్రామానికి స్తంభించిపోయాయి.

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న కేరళకు చెందిన వధువు గోతులతో, వర్షపు నీటితో మడుగులా మారిన ఓ రోడ్డుపై నడుస్తూ చిత్రాలు దిగారు. వాటిని చూసైనా ప్రభుత్వం స్పందించాలన్న ఆమె కోరిక మేరకు ఆ చిత్రాలను ఏరో వెడ్డింగ్‌ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.

Source: Eenadu

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుమలలో అలంకరణలు వేగవంతం చేశారు. విద్యుత్‌ కాంతులతో ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది.

Source: Eenadu

వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని గాంధీనగర్‌లో ఆళ్ల వెంకటేశ్వర్‌రావుకు చెందిన పత్తి చేనులో కలుపు తీస్తున్న మహిళలు మంగళవారం భారీ కొండ చిలువను గుర్తించారు. పొట్ట వద్ద లావుగా ఉండడంతో గ్రామస్థులు కత్తితో చీల్చి చూడగా, పిల్లి బయటపడింది.

Source: Eenadu

మూడేళ్లు మృత్యువుతో పోరాడి క్యాన్సర్‌ నుంచి కోలుకొన్న గృహిణి శేషం అశ్విని.. నగరంలో అభాగ్యులు, అనాథల సేవకు కదిలారు. ఆసుపత్రులు, బస్‌స్టేషన్ల వద్ద ఆదరణకు నోచుకోని వారిని గుర్తించి.. వారికి స్నానం చేయించి కొత్త దుస్తులు, ఆహారం అందిస్తున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home