చిత్రం చెప్పే విశేషాలు!

(23-09-2022/1)

భారీ వర్షాలకు దేవరకద్ర పట్టణ కేంద్రానికి సమీప నల్లలబావి వద్ద వాగు నిండుగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటేందుకు దాదాపు 300 మంది రైతులు భూజాల లోతులో నడుస్తూ.. ఈదుతూ నిత్యం సాహసమే చేయాల్సి వస్తోంది.

Source: Eenadu

చినుకు పడితే చాలు.. మహారాష్ట్ర సరిహద్దు గుల్లాతండాకు వెళ్లే రోడ్డంతా చిత్తడిగా మారుతోంది. వాహన టైర్లు బురదలో కూరుకుపోయి కదలని పరిస్థితి నెలకొంటోంది. గురువారం హనేగావ్‌ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బురదలో దిగబడి గంటసేపు నిలిచిపోయింది.

Source: Eenadu

కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో ఓ బర్రెకు తాడు కట్టినా దాన్ని తెంపేసుకొని మేత కోసం పంట పొలాల్లోకి దిగుతోంది. దీంతో రైతు తన ఇంట్లో ఉండే శునకానికి కాపలా కాసే అలవాటు చేశారు. ఆ శునకం బర్రెపై ఎక్కి కూర్చుంటుంది.

Source: Eenadu

అక్కడి గ్రామస్థులు ఏ రోగమొచ్చినా చికిత్సకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు భయపడుతున్నారు.. కారణం శిథిల భవనంలో సేవలు అందిస్తుండడమే. ఇదీ పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి.

Source: Eenadu

స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో గురువారం ఆకట్టుకున్న 186 కిలోల బంగారు క్యూబ్‌ ఇది. 24 క్యారెట్ల బంగారంతో నిక్లస్‌ క్యాస్టెల్లో అనే కళాకారుడు ‘ద క్యాస్టెల్లో క్యూబ్‌’ పేరుతో ఈ కళాఖండానికి ప్రాణం పోశారు.

Source: Eenadu

సికింద్రాబాద్‌లోని బాంటియా గార్డెన్‌లో గురువారం దాండియా రాస్‌ ఉత్సాహంగా సాగింది. గుజరాతి సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రాలతో యువతులు సందడి చేశారు. ఈ నెల 26 నుంచి ఆక్టోబరు 4 వరకు ఇది కొనసాగనుంది.

Source: Eenadu

వర్షం కురుస్తున్న సమయంలో మొక్కల్ని నాటితే అవి ఏపుగా పెరిగే అవకాశం ఉంది. మోడువారే అవకాశం తక్కువ. నాటిన ప్రతి మొక్క బతకాలని.. చినుకులు కురుస్తున్న సమయంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది హడావుడిగా సైబర్‌ టవర్స్‌ ప్రాంతంలో నాటేందుకు తీసుకెళ్తున్నారిలా.

Source: Eenadu

దుమ్ముతో నిండిన ఈ రహదారిని చూశారా?హైదరాబాద్‌ నగరంలో అడపాదడపా పలుచోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. బోర్లు వేసే వారి ఇష్టారాజ్యానికి ఇలా వదిలేస్తున్నారు. గురువారం మణికొండలో స్థానిక నేతాజీ పార్కు వద్ద కనిపించిన చిత్రం ఇది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2022/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(26-09-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు!(26-09-2022/1)

Eenadu.net Home