చిత్రం చెప్పే విశేషాలు...!

(28-09-2022/1)

వంగ తోటలో కాయలు తెంపాలంటే ఎవరైనా ఒళ్లు వంచాల్సిందే... అవే కాయలు అందనంత ఎత్తులో ఉంటే ఆశ్చర్యమే. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆకుల లీలావతి పెరట్లోని వంగ మొక్క ఏకంగా ఏడడుగులు పెరిగింది. ప్రతినెలా అయిదు కిలోల కాయలు కూడా ఇస్తోంది.

Source: Eenadu

ఈ చిత్రంలోని బాలిక పేరు షేక్‌ ఫరీదాబాను. కర్నూలు జిల్లాకి చెందిన ఈ బాలికకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. దీంతో కాలి వేళ్లు తోడుగా అక్షరాలు దిద్దుతోంది. చేతితో రాసినంత అందంగానే ముత్యాల్లా అక్షరాలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Source: Eenadu

దిల్లీలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డును అందిస్తున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ.

Source: Eenadu

మూడు గ్రామాలకు తాగునీరు.. దాదాపు 250 ఎకరాలకు సాగు నీరందించే చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని చెన్నుపల్లి చెరువులో యథేచ్ఛగా గ్రానైట్‌ వ్యర్థాలను పోసి ఆక్రమిస్తున్నా అధికారులకు పట్టడం లేదు.

Source: Eenadu

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయాల్లో అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Source: Eenadu

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌కు చెందిన రైతు పిట్టల రాజు తన వరిపంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు పొలం మధ్యలో తాటి ఆకులను అక్కడక్కడ నాటాడు. ఆ ఆకుల చప్పుళ్లతో ఎలుకలు పరారవుతున్నాయి.

Source: Eenadu

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాన్ని మంగళవారం 108 పోలెలు(భక్షాల)లతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి నైవేద్యంగా భక్షాలు సమర్పించడంతోపాటు వాటితోనే ప్రత్యేకంగా అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు.

Source: Eenadu

తమిళనాడులోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్‌లో చేరేందుకు ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నుంచి మంగళవారం ప్రత్యేక రైలులో బయలుదేరిన గిరిజన బాలికలతో మాట్లాడుతున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home