చిత్రం చెప్పే విశేషాలు..!

(02-10-2022/1)

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండల కేంద్రం పాతూర్‌లో ఓంకార రూపిని సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు రూ.1.16 కోట్లతో మండపాన్ని అలంకరించారు.

Source: Eenadu

ఇదేంటీ ట్రాఫిక్‌ పోలీసు ఉండాల్సిన పాయింట్‌లో కొండముచ్చు కూర్చుందని ఆశ్చర్యపోతున్నారా? ఈ సరదా దృశ్యం మెదక్‌ పట్టణంలోని ర.భ. కార్యాలయం వద్ద కనిపించింది. దాదాపు అరగంట సేపు తానే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తునట్లుగా ఆహార్యం ప్రదర్శించింది.

Source: Eenadu

పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ స్పూన్లతో అస్సాంలోని ధుబ్రిలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం.

Source: Eenadu

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శనివారం స్వర్ణాభరణ శోభతో అలరారింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితోపాటు గర్భాలయాన్ని స్వర్ణాభరణాలతో అలకరించారు.

Source: Eenadu

హైదరాబాద్‌ నగర శివారు మహేశ్వరంలో ఓ వ్యక్తి తన విల్లాలో ఇలా చెక్కతో తయారు చేసిన ఫ్యాన్‌ను అమర్చుకున్నారు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫ్యాన్‌ గదిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేగాన్ని హెచ్చుతగ్గులు చేసుకుంటుంది.

Source: Eenadu

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ వెనక గేటు దుస్థితి ఇది. పక్కనే ఉన్న ఓ గోడను చీల్చుకొని వచ్చిన చెట్టు వేర్లు ఏకంగా మార్కెట్‌ ప్రవేశద్వారం చుట్టూ అల్లుకున్నాయి. వేర్ల ధాటికి ప్రవేశద్వారం గోడలకు పగుళ్లు వచ్చాయి.

Source: Eenadu

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో ప్రతిష్ఠించేందుకు 1500 కిలోల కంచుతో తయారైన 10 అడుగుల ఎత్తున్న ‘ధ్యాన గాంధీ’ విగ్రహం శనివారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి తరలివెళ్లింది. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పులు చెప్పారు.

Source: Eenadu

జగన్మాత సేవలో భక్తులు తరిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. గాజుల అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి మూలవిరాట్‌.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home