చిత్రం చెప్పే విశేషాలు..!
(04-10-2022/1)
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడి చివర్లో గంగమ్మ ఒడికి చేర్చారు.
Source: Eenadu
సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Source: Eenadu
సనత్‌నగర్‌లోని కనకదుర్గ అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు.
Source: Eenadu
చందానగర్‌లో మాగంటి శ్రీనివాస్ ఇంట్లో ఆదివారం రాత్రి ఒకేసారి 11 బ్రహ్మ కమలాలు విరబూశాయి. గతేడాది 3 రోజుల్లో 13 పూలు పూయగా ఈసారి ఒకేరోజు అత్యధికంగా పుష్పాలు వికసించడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Source: Eenadu
బ్రిటన్‌కు చెందిన డూడుల్ కళాకారుడు సామ్ కాక్స్.. ఇంగ్లండ్‌లోని తన పన్నెండు గదుల భవనాన్ని స్వయంగా గీసిన కార్టూన్ డూడుల్స్‌తో అందంగా తయారు చేశాడు. సోమవారం తన భార్య అలెనాతో ఇలా చిత్రాలు దిగాడు.
Source: Eenadu
దుర్గామాత పూజ, దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం బిహార్ రాజధాని పట్నా నుంచి సొంతూర్లకు వెళ్తున్న వారితో కిక్కిరిసిన రైలు.
Source: Eenadu
పనికిరాని వివిధ రకాల ఇనుప వస్తువులతో అమ్మవారి రూపాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేశారు.
Source: Eenadu
దసరా నేపథ్యంలో కర్నూలు బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసింది. వారి సంఖ్యకు తగినన్ని బస్సులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
Source: Eenadu