చిత్రం చెప్పే విశేషాలు!

(05-10-2022/2)

తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ మేరకు సమావేశంలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌.

Source: Eenadu

ట్యాంక్‌బండ్‌ పండగ శోభను సంతరించుకొంది. దారి మొత్తాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆ కాంతులన్నీ పక్కనే ఉన్న సాగర్‌లో ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

నానక్‌రాంగూడ కూడలిలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్ జీసీఎల్‌) కార్యాలయం సమీపంలో ఇనుము తుక్కుతో 12 అడుగుల ఎత్తున మానవ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Source: Eenadu

క్రమటోర్స్క్‌లో రష్యా దాడి అనంతరం క్షిపణి అవశేషాలను తొలగిస్తున్న ఉక్రెయిన్‌ సిబ్బంది.

Source: Eenadu

నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని వక్క పూతతో అలంకరించారు. విజయదశమి నేపథ్యంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ అలంకరణ చేశారు.

Source: Eenadu

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని తెదేపా అధినేత చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.

Source: Eenadu

తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. ఓ వ్యక్తి ఇలా తన శరీరంపై సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ నినాదాలు రాసుకొచ్చాడు.

Source: Eenadu

చిలీలోని కోపియాపో సమీపంలోని అటకామా ఎడారిలో ఇలా పువ్వులు పూశాయి. ప్రతి ఐదు నుంచి ఏడేళ్లకొకసారి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయట. దాంతో అక్కడ కొన్ని పూల మొక్కలు పెరిగి.. అవి పువ్వులు విరబూస్తూ స్థానికులకు కనువిందు చేస్తున్నాయి.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home