చిత్రం చెప్పే విశేషాలు!

(06-10-2022/1)

ఏపీలోని కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం కర్రల సమరం జరుగుతుంది.

Source: Eenadu

దసరా పండగ నేపథ్యంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభిస్తోంది. కర్ణాటకలోని పాండవపుర తాలుకాలో సాగుతున్న యాత్రలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. మధ్యలో ఓ చోట ఆమె షూ లేసులు ఊడిపోగా.. రాహులే కట్టారు.

Source: Eenadu

మెగాస్టార్‌ కథానాయకుడిగా.. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. దసరా పండగ రోజున విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.38 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు పేర్కొంటూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.

Source: Eenadu

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.

Source: Eenadu

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాసి మాసం, వరుస సెలవులు రావడంతో రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంపెక్స్‌-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home