చిత్రం చెప్పే విశేషాలు..!

(10-10-2022/1)

భారీగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ పిరిబంద గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాల భవనం కుప్పకూలింది. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులు లేరు. పెద్దప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.

Source: Eenadu

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విజయనగరం జిల్లా గరివిడి మండలం గదబవలసలో మొక్కజొన్న రైతుల కొంపముంచాయి. చేతికందిన పంటను కోసి ఆరబెట్టిన సమయంలో వర్షాలకు తడిచి మొలకలు వచ్చాయి. రూ.15 లక్షల వరకు నష్టపోయామని రైతులు తెలిపారు.

Source: Eenadu

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం పది రోజులుగా అలజడి సృష్టిస్తోంది. కెరటాలు భారీగా ఎగసిపడుతుండటంతో తీరప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. కొన్ని ఇళ్లు, చెట్లు నేలకూలాయి.

Source: Eenadu

హనుమకొండ జిల్లా దర్గా కాజీపేటలో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా తీసిన ర్యాలీలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఒక వాహనానికి హనుమాన్‌ జెండా, మరో వైపు ముస్లింల జెండా పెట్టారు. జాతీయ పతాకాన్ని, ముస్లిం జెండాలను పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.

Source: Eenadu

తెనాలిలో ఒకప్పుడు పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్‌ ఇది. ఇప్పుడు ముళ్ల పొదలమాటున శిథిలమై కనుమరుగైపోతోంది. తెనాలి వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో గత ప్రభుత్వం రూ.40లక్షలతో దీన్ని నిర్మించింది. 

Source: Eenadu

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులు తీరాయి. దసరా సెలవులు ఆదివారంతో ముగియడం, సోమవారం నుంచి విద్యా సంస్థలు, కార్యాలయాలు పని చేస్తుండటంతో సొంతూళ్లకు వెళ్లిన భాగ్యనగర వాసులు తిరుగుపయనమయ్యారు.

Source: Eenadu

హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ ఓలుబెడ్డ నుంచి రంగశీల గ్రామం వరకు విస్తరించి ఉన్న ఈ కొండలను జెండాకొండలు అని పిలుస్తారు. వీటిపై మేఘాల అందాలు చూస్తూ పర్యటకులు మంత్రముగ్ధులై పోతున్నారు. పాల సముద్రంలా కనిపిస్తోందంటున్నారు.

Source: Eenadu

చేబ్రోలు నాగేశ్వరస్వామి గాలిగోపురంపై ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుడు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home