చిత్రం చెప్పే విశేషాలు..!

(05-08-2022/1)

ఐస్‌ల్యాండ్‌ రాజధాని రెక్జానిక్‌ సమీపంలో ఉన్న ఫాగ్రాడల్స్‌ఫ్జల్‌ అగ్నిపర్వతం పేలడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న లావా. దాదాపు 8 నెలల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని అధికారులు తెలిపారు.

Source: Eenadu

విజయవాడ పటమటలోని జీడీఈటీ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ తరగతికి 70 నుంచి 95 మంది విద్యార్థులు ఉన్నారు. తగినన్ని వసతుల్లేక ఒకే గదిలో రెండు సెక్షన్లకు చెందిన విద్యార్థులు కిక్కిరిసి ఇబ్బందిగా కూర్చోవాల్సి వస్తోంది.

Source: Eenadu

మిస్‌ ఇండియా-2021 మానస వారణాసి గురువారం నగరంలో సందడి చేశారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Source: Eenadu

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో గురువారం కొండచరియలు విరిగి పట్టాలపై పడిపోవడంతో నిలిచిపోయిన రైలు.

Source: Eenadu

ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో కొన్ని విభాగాలకు ఇసుకకొండపైన సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నుంచి వెళ్లాలి. ఇక్కడి దారంతా గుబురుగా పెరిగిన మొక్కలతో, చెత్తతో ఉండటంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Source: Eenadu

యాడికి మండలంలోని కోన జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. మూడు రోజులుగా పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకృతి అందాల నడుమ కొండల నుంచి జాలు వారుతున్న సెలయేరు అందాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి.

Source: Eenadu

ఉలవపాడు మండలం తెట్టు నుంచి రామాయపట్నం వెళ్లే మార్గంలో ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి) ఉంది. ఇసుక లారీలు ఇలా బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్‌యూబి వద్ద ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Source: Eenadu

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ శివారులో గురువారం పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. చల్లటి వాతావరణం.. పచ్చటి పొలాల మధ్య ఇలా పురివిప్పి నాట్యం చేసింది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(08-08-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(08-08-2022/1)

చిత్రం చెప్పే విశేషాలు! (07-08-2022/2)

Eenadu.net Home