చిత్రం చెప్పే విశేషాలు..

(12-08-2022/1)

కరీంనగర్‌లోని ప్రధాన పోస్టాఫీసు వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ బోర్డు వద్ద జెండాలు కొనుగోలు చేసిన కస్టమర్లను పోస్టాఫీసు సిబ్బంది ఫొటోలు తీశారు. ఇక్కడ జాతీయ జెండాను చేత పట్టుకొని ఫ్రేమ్‌లో నిలబడి చిత్రాలు తీయించుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు.

Source: Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ దుమ్ముగూడెం మండలం బండారుగూడెంలోని సోదరులకు రాఖీ కట్టేందుకు ఇలా వరద నీటిని దాటి పుట్టింటికి చేరుకుంది.

Source: Eenadu

రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు రాఖీ పండుగకు సృజనాత్మకత చాటారు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఆయన గురువారం 15 వేల నాణేలతో పది అడుగుల రాఖీని ప్రదర్శన కోసం రూపొందించారు.

Source: Eenadu

నాగార్జునసాగర్‌ జలాశయానికి పై నుంచి వరద రాకతో గేట్లు ఎత్తారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. యువతీయువకులు సుందర దృశ్యాలను చరవాణుల్లో బంధించారు.

Source: Eenadu

అరే చూడముచ్చటగా ఉన్న ఈ రాఖీలు మొక్కలకు కాశాయేంటని అనుకుంటున్నారా.. వీటి శాస్త్రీయ నాయం ఫాసీ ఫ్లోరా. ఇది లాటిన్‌ పదం. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్యాషన్‌ ఫ్లవర్‌గా పేర్కొంటే.. జపాన్‌లో క్లాక్‌ ఫ్లవర్‌(గడియార పుష్పం), మన దేశంలో కృష్ణ కమలం, రాఖీ ఫుష్పంగా పిలుస్తారు.

Source: Eenadu

రాజస్థాన్‌ అజ్‌మేర్‌లో జైలులో ఉన్న తనకు సోదరి రాఖీ కడుతుండగా ఓ ఖైదీ భావోద్వేగం.

Source: Eenadu

విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో హెచ్‌.పి.సి.ఎల్‌., సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో గురువారం 1,240 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు.

Source: Eenadu

నిజాం నవాబుల కాలంలో యుద్ధాల్లో వాడిన రకరకాల ఫిరంగులను హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లోని స్టేట్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. నిర్వహణ లోపం కారణంగా అవి తుప్పుపడుతున్నాయి. ఫిరంగి బండి చక్రాలు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వారం రోజులుగా త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. బురుజు ముందు భాగంలో భారీ జాతీయ జెండా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Source: Eenadu

మెక్సికోలో కరవు కరాళనృత్యం చేస్తోంది. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం దొరకడం లేదు. ఫలితంగా అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. చిచౌహా రాష్ట్రం మాన్యుయెల్‌ బెనావిడెస్‌ మున్సిపాలిటీ పరిధిలో మరణించిన జంతువుల మృత కళేబరాలివి.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home