చిత్రం చెప్పే విశేషాలు..!

(11-10-2022/1)

విజయనగరంలో నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాల్లో భాగంగా వివిధ కళాకారులు ఇచ్చిన నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. నగర శివారు పర్వతాపూర్‌లో నిర్మించిన చెక్‌డ్యామ్‌పై ప్రవహిస్తూ కనువిందు చేస్తున్న నదీ జలంలో పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతో నురగులు కక్కుతోంది.

Source: Eenadu

చైనాలోని గ్వాంగ్జౌకు చెందిన ఎక్స్‌పెంగ్‌ సంస్థ రూపొందించిన ఎగిరే విద్యుత్తు ట్యాక్సీ ఇది. సోమవారం యూఏఈలో దీనిని ప్రదర్శించారు.

Source: Eenadu

ఈ మూగ జీవాలు పడుతున్న వేదన వర్ణనాతీతం. పదుల సంఖ్యలో పశువులను కంటైనర్‌లో కుక్కి, ఒకదానిపై ఒకటి, కనీసం కదిలేందుకు కూడా వీలులేకుండా తరలిస్తున్నారు. వీటిని రాజమహేంద్రవరం అక్రమంగా చెన్నై కబేళాకు తరలిస్తున్నారు.

Source: Eenadu

ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లె పరిసర ప్రాంతాల్లోని రైతులు వరి, చిక్కుడు, మొక్కజొన్న తదితర దిగుబడులను ఆరేసుకొనే ప్రదేశాల్లో కోతులు సంచరిస్తూ వాటిని నాశనం చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా పులి బొమ్మలను ఇలా కాపలాగా ఉంచుతున్నారు.

Source: Eenadu

జీజీహెచ్‌లోని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సా కేంద్రం శునకాలకు ఆవాసంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో బాలింతలు చంటి బిడ్డలతో వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకునే ప్రాంతంలో ఇలా కుక్కల సంచారం ప్రమాదకరంగా మారింది.

Source: Eenadu

మాకవరపాలెం మండలం తమ్మయ్యపాలెంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన రెండు భవనాలు వర్షాల వల్ల కారుతున్నాయి. దీంతో బడిని తాత్కాలికంగా ఊరిలోని రామాలయంలోకి మార్చారు.

Source: Eenadu

దామెర క్రాస్‌రోడ్డు వద్ద ప్రారంభమయ్యే జాతీయ రహదారి ఔటర్‌ రింగు రోడ్డు వద్ద కొన్ని రోజులుగా ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ దీపాలు వెలగక ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది. ఈ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటన సమయంలో వెలిగిన దీపాలు, ఆ తరువాత వెలగక పోవడం విశేషం.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home