చిత్రం చెప్పే విశేషాలు..!
(13-10-2022/1)
గుంటూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ సూర్యప్రతాప్ అంతర్జాలంలో వీడియోలు చూసి వినూత్న గ్రైండర్‌ను తయారు చేశారు. ఇందుకు వ్యాయామం కోసం ఉపయోగించే సైకిల్‌కు గ్రైండర్‌ను జోడించారు. దీంతో సైక్లింగ్ చేస్తూనే పిండి రుబ్బుకోవచ్చు.
Source: Eenadu
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో చోరుపల్లి, గెద్రజోల గ్రామాల మధ్యలో జర్న రహదారి బీటలువారి పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గమనించిన స్థానికులు భూకంపం కావొచ్చని ఆందోళన చెందారు.
Source: Eenadu
విశాఖ స్టీల్‌ప్లాంట్ కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్) నుంచి సాయం సంధ్య వేళ పశ్చిమ దిక్కున సూర్యకాంతి కనువిందు చేస్తుంది. బుధవారం కాంతిని వెదజల్లుతున్న సూర్య కిరణాలు రిజర్వాయర్ నీటితో సయ్యాటలాడాయి.
Source: Eenadu
ఆదోని పట్టణం క్రాంతినగర్ సమీపంలోని శ్రీరామనగర్ కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై బురద దారులతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారి కాళ్లు కడుక్కోవాల్సిందే.
Source: Eenadu
ఆటోను ఢీ కొట్టిన లారీలా కనిపిస్తోంది కదూ? నిజానికి లారీ క్యాబిన్‌ను మరమ్మతులకు పాతబస్తీ నుంచి నగర శివారు హయత్‌నగర్‌కు ఇలా ఆటోపై కట్టి తరలిస్తున్న దృశ్యమిది.
Source: Eenadu
ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ‘మిస్ సూపర్ మోడల్ వరల్డ్‌వైడ్ 2022’ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందగత్తెలు.
Source: Eenadu
గుంటూరు నగరంలోని జీజీహెచ్ రాష్ట్రంలోనే 1260 పడకలు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల. కానీ, ఆస్పత్రి ప్రాంగణం ఇలా తుప్పుపట్టి పాడైపోయిన ఇనుప సామగ్రితో నిండిపోయింది.
Source: Eenadu
బస్సు పాసులు తీసుకోవాలంటే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి వరసలో నిలబడాల్సి వస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల తర్వాత మళ్లీ కౌంటర్ వద్దకు వచ్చి వేచి చూడాల్సి వస్తోంది. తార్నాక ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఇలా వరస కట్టారు.
Source: Eenadu