చిత్రం చెప్పే విశేషాలు..!

(16-10-2022/1)

హైదరాబాద్‌ నగరంలో ఏటా నిర్వహించే సదర్‌ ఉత్సవం కోసం వీటిని హరియాణా నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తారు. శనివారం పీపుల్స్‌ ప్లాజాలో విన్యాసాలు చేయిస్తూ కనిపించారిలా..

Source: Eenadu

ఈ చిత్రాన్ని చూసి మోడువారిన ఓ చెట్టు వర్షాలకు చక్కగా చిగురిస్తోందనుకుంటే పొరపడినట్లే. కొమ్మల చివరన ఉన్నవి చిగురుటాకులు కాదు... పంట పొలాల మీదుగా తరలివెళ్లే పిచ్చుకలు కాసేపు ఇలా కనికట్టు చేశాయి.

Source: Eenadu

పదేళ్లుగా కాలనీకి రోడ్డు లేదని వందల సార్లు మొరపెట్టుకున్నా వినకపోవటంతో చండూరు మండలం శిర్థేపల్లి వాసులు శనివారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ప్రచారానికి వస్తున్న అభ్యర్థులు మాకు రోడ్డు వేయిస్తే.. మేము వారికి ఓటు వేస్తామని పేర్కొన్నారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధిని స్వాగతించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. శనివారం మండలంలోని పెద్దాపురం, రాయికుంట తండా, రాందాస్‌తండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజన దుస్తులతో తండాలలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

Source: Eenadu

ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. శనివారం నాంపల్లి మండలం పస్నూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఉదయాన్నే ప్రచారానికి బయలుదేరారు.

Source: Eenadu

నాంపల్లి మండలం ముష్టిపల్లి ప్రాదేశిక నియోజవర్గ పరిధిలోని గ్రామాల్లో శనివారం తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరపున మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత ప్రచారం నిర్వహించారు. ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో నూడుల్స్‌ వండి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Source: Eenadu

ఇది ద్విచక్రవాహనం అనుకుంటున్నారా? లేదా రెండు చక్రాల కారనుకున్నారో కానీ... ఏకంగా కారులో పట్టేంత మంది వాహనంపై ప్రయాణిస్తున్నారు. అందులో ఒక నవజాత శిశువును ప్రమాదకరంగా తీసుకెళ్లడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. బోధన్‌ పట్టణం మీదుగా వెళుతుండగా తీసిన చిత్రం.

Source: Eenadu

హైదరాబాద్‌ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లు నగరంలోని రహదారి దుస్థితి ఇది. చిన్న వడ్డేపల్లి చెరువు నుంచి ఎనుమాముల మార్కెట్‌కి వెళ్లే రోడ్డుపై ఇలా గుంతలు పడ్డాయి. ఈ రోడ్డును బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home