చిత్రం చెప్పే విశేషాలు..!

(19-10-2022/1)

విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌-సీవీఆర్‌ కళాశాలలో మంగళవారం జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు 700 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాకు వచ్చిన వారిలోనూ చాలా మంది చిన్న ఉద్యోగాలు చూసి వెనుదిరిగినట్లు తెలిసింది.

Source: Eenadu

వర్షాల వల్ల భూమిలో తేమ ఎక్కువై పొలంలో నాటిన మొక్కలు చనిపోతున్నాయి. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. తొలిదశ కాపు చాలా చోట్ల రాలిపోతోంది.

Source: Eenadu

నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా ఉదయం, సాయంత్రం సమయంలో తక్కువ ఎత్తులో విమానం ఎగురుతుండటంతో ప్రజల ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అవి శిక్షణ విమానాలని అధికారులు చెప్పారు.

Source: Eenadu

ఓ అమ్మాయి పత్తి చేనులో ఏం చేస్తోందబ్బా.. అనుకుంటున్నారా.. అచ్చం మనుషుల్లా కనిపిస్తున్న బొమ్మలు ఇవి. నిర్మల్‌ జిల్లా కుభీరు మండలం చొండి గ్రామ రైతు లక్ష్మణ్‌.. వన్యప్రాణులు, పక్షుల నుంచి తన పత్తి పంటను రక్షించుకోవడానికి ఈ బొమ్మలు తయారు చేసి ఇలా పెట్టారు.

Source: Eenadu

ఈ లారీలన్నీ ఇలా ఉండటం చూసి భారీ ట్రాఫిక్‌ జామ్‌ అనుకునేరు సుమా.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు మంగళవారం తనిఖీ కోసం ఇలా అర కిలోమీటరు మేర బారులు తీరాయి.

Source: Eenadu

రైలు కిటికీలోంచి పిల్లలు తొంగి చూస్తున్నట్లుగా ఉంది కదూ.. రైలు అనుకుంటే పొరపాటే. చిన్నారుల భవితను తీర్చిదిద్దే తరగతి గదులు ఇవి. కొండాపూర్‌ మండలం మునిదేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గదులను ఇలా తీర్చిదిద్దారు.

Source: Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని జోలాపుట్టు జలాశయంలో నిండుగా నీరు చేరింది. ఉదయం వేళ ఆకాశంలో మబ్బులు నిశ్చలంగా ఉన్న జలాశయం నీటిలో ప్రతిబింబిస్తూ చూపరులను ఆకట్టుకుంది.

Source: Eenadu

రాజవొమ్మంగి మండలంలోని పలు చోట్ల రహదారులు గోతులమయంగా ఉన్నాయి. రాజవొమ్మంగి నుంచి మొల్లిమెట్ల మీదుగా లబ్బర్తి వెళ్లే రహదారి మరింత అధ్వానంగా ఉంది. మంగళవారం అరుణ వర్ణంలో సూర్యుని ప్రతిబింబం ఈ రహదారి గోతుల్లో ఎర్రటి గోళంలా కనిపించింది.

Source: Eenadu

కొండపిలోని పొదిలి రోడ్డు వర్షానికి దుర్భరంగా తయారైంది. పోలీసు స్టేషన్‌ దగ్గర నుంచి నూతన ఎస్‌బీఐ కార్యాలయం వరకు రోడ్డు దుస్థితిని అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా ఆ నీటిలో సీపీఎం మండల కార్యదర్శి మస్తాన్‌ ఆధ్వర్యంలో నాయకులు, ఆటో చోదకులు మంగళవారం వరి నాట్లు వేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home