చిత్రం చెప్పే విశేషాలు..!

(20-10-2022/1)

ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనంతపురం నగరానికి చెందిన 15 ఏళ్ల నిత్యశ్రీ సాహస యాత్ర చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని అనంతపురం నుంచి ఎన్‌ఎస్‌ గేటు వరకు 45 కి.మీ. దూరం స్కేటింగ్‌ చేశారు. కళ్లకు గంతలతో స్కేటింగ్‌ చేస్తూనే కారు లాగారు.

Source: Eenadu

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లే 108 అంబులెన్స్‌లు ఇవి. లైఫ్‌ సపోర్టుతో ఆధునిక సంజీవనులా సిద్ధం చేసిన వాహనాలు మూడు నెలలుగా విజయవాడ సిద్దార్థ మెడికల్‌ కళాశాల మైదానంలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయి.

Source: Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లిలో రూ.1.52 కోట్లతో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించారు. ఈ భవనానికి వైకాపా జెండా రంగులు వేశారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు.

Source: Eenadu

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ వినూత్న పరికరం తయారు చేశారు. దాంతో దున్నుతూ పోతుంటే కూలీల అవసరమే లేకుండా కలుపు తొలగి.. ఎరువు పడిపోతోంది.

Source: Eenadu

మన దేశానికి చెందిన 307 పురాతన విగ్రహాలను అమెరికా అధికారులు తిరిగి అప్పగించారు. ఇవన్నీ భారత్ నుంచి అక్రమంగా తరలించినవేనని.. 15 ఏళ్ల దర్యాప్తు అనంతరం వీటిని భారత్‌కు చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహాల విలువ దాదాపు రూ.33 కోట్లు ఉంటుందని అంచనా.

Source: Eenadu

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, గిరిజనులు తమ పిల్లల చదువుల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు. వాగు వద్దకు చేరుకొని పిల్లలను తండ్రి భుజాలపై ఎత్తుకొని వాగుదాటి ప్రైవేట్‌ పాఠశాల బస్సెక్కిస్తున్నారు.

Source: Eenadu

జుక్కల్‌ ఉర్దూ మాధ్యమ పాఠశాల ఆవరణ లోతట్టుగా ఉంది. వర్షం వస్తే సమీపంలోని కుంట నిండి ప్రాంగణం వరదతో నిండుతోంది. ఇక్కడ 104 మంది విద్యార్థులున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికీ ఈ పరిస్థితి తలెత్తింది.

Source: Eenadu

కాలకృత్యాలు తీర్చుకునేందుకు రింతాడ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో నీటి కొరత ఏర్పడింది. ఊర్లోని బోర్ల నుంచి విద్యార్థినులు నీరు మోసుకెళ్లాల్సి వచ్చింది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home