చిత్రం చెప్పే విశేషాలు..!
(24-10-2022/2)
దీపావళి సందర్భంగా చిరు 154వ చిత్రం టైటిల్ టీజర్, చిరు ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం సోమవారం ఉదయం విడుదల చేసింది. ఇందులో ‘వాల్తేరు వీరయ్య’గా చిరు నిజమైన బాంబులు పేల్చి.. అభిమానులకు ‘దీపావళి బాంబు’ పేల్చినంత ఆనందం ఇచ్చాడు.
Source: Eenadu
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో కుక్కుర్ తిహార్ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేపాల్ పోలీసులు, ప్రజలు తమ శునకాలకు కుంకుమతో బొట్లు పెట్టి, పూలు చల్లి ప్రత్యేకంగా పూజించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వాటికి పతకాలు ప్రదానం చేశారు.
Source: Eenadu
ఫిలిప్పీన్స్‌లోని మక్టన్-సీబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ కొరియా విమానం ఆదివారం రాత్రి రన్‌వేపై అదుపుతప్పింది. పక్కనే ఉన్న పచ్చిక మైదానంలో కొంత దూరం దూసుకెళ్లి ఆగిపోయింది. దీంతో అందులోని 173 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Source: Eenadu
ఏటా సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోదీ ఈ సారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కార్గిల్ వెళ్లి జవాన్లను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ తుపాకీ తీసుకొని ఇలా సరదాగా గురి పెట్టారు.
Source: Eenadu
సినీనటుడు రామ్‌చరణ్ తన అభిమానులకు సామాజిక మాధ్యమాల వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన సతీమణి ఉపాసనతో కలిసి జపాన్‌లో దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
Source: Eenadu
టీ20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీరోచితంగా ఆడి భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆటతీరును పొగుడుతూ ‘అమూల్’ సంస్థ ఇలా తన ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్ది ఆకట్టుకుంది.
Source: Eenadu
ఉక్రెయిన్‌లోని మైకొలైవ్ నగరంలో ఓ ట్యాంకు వద్ద ప్రజలు తాగునీటి కోసం ఇలా బారులుతీరారు. రష్యా యుద్ధం కారణంగా ఏప్రిల్ నుంచి చాలాచోట్ల నీటి సరఫరా జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
Source: Eenadu
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ‘అఖండ’. ఈ సినిమాను గోవాలో నవంబర్ 20నుంచి 28 మధ్య జరగనున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu