చిత్రం చెప్పే విశేషాలు..!
(25-10-2022/1)
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దలు దీపాలు వెలిగించడంతో పాటు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
Source: Eenadu
నటి పూర్ణ వివాహం దుబాయ్‌లో ఘనంగా జరిగింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని పెద్దల సమక్షంలో ఆమె పెళ్లాడింది. ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసింది.
Source: Eenadu
దీపావళి పండగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రక్కసిని దహనం చేశారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతోందని చెబుతూ పలువురు బాధితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Source: Eenadu
ఉత్తర ఫ్రాన్స్‌లోని బిహుకోర్ట్‌లో టోర్నడో కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.
Source: Eenadu
దీపావళి పండగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆవులను పూజించి.. వాటికి నైవేద్యం సమర్పిస్తారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ కుటుంబం మొత్తం ఇలా పూజలు చేస్తూ కనిపించారు.
Source: Eenadu
1963 సంవత్సరం నవంబర్ 15న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న రాష్ట్రపతిభవన్ సిబ్బంది.
Source: Eenadu
ఈ కీటకం శాస్త్రీయ నామం మాంటిస్. మన ప్రాంతంలో గొల్లభామ అని పిలుస్తుంటారు. ఏడాది సగటు జీవితకాలం కలిగి పంటలకు నష్టం కలిగించే కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తుంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేదునూరు గ్రామంలో కనిపించింది.
Source: Eenadu
తామర పువ్వు అంత పెద్ద సైజులో పెరుగుతున్న పుట్టగొడుగు ప్రజలను ఆకట్టుకొంటోంది. సోమందేపల్లి మారుతీనగర్ కాలనీలో పాత సినిమా థియేటర్ వద్ద గల ఈ పుట్టగొడుగును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Source: Eenadu
ఫిలిప్పీన్స్‌లో మిడ్‌టర్మ్ పరీక్షల సందర్భంగా కాపీయింగ్ కోసం పక్క చూపులు చూడకుండా ఉండేందుకు కొత్తగా ఆలోచించి ఇంటి నుంచే ఎవరికివారు ఏర్పాట్లు చేసుకురావాలని కళాశాల యాజమాన్యం కోరగా.. విద్యార్థులు ఇలా తలోరకంగా వచ్చారు.
Source: Eenadu