చిత్రం చెప్పే విశేషాలు..!

(28-10-2022/1)

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులు వానరాలకు ఆహారం వేస్తే రూ.1000 అపరాధ రుసుం విధిస్తామంటూ అటవీశాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులు మానవత్వంతో ఆలోచించాలిగానీ, ఇలా జరిమానా విధించడమేంటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు.

Source: Eenadu

పచ్చని అడవిలో నల్లటి రాళ్లపై దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న జలధారలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జలపాతం తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఉంది.

Source: Eenadu

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు పసిడి వర్ణపు ఛాయతో ప్రకాశించగా.. తెలుపు వర్ణంలోని మల్లికార్జున ఆలయం కొంగొత్త అందాలకు నెలవైంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం గురువారం ఉదయం ఇలా కనిపించింది.

Source: Eenadu

జడ్చర్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ ఎవరికి పని ఉన్నా అవసరమైన మనుషులను పంపే ఏజెన్సీల్లాగా తయారయ్యాయి. గంగాపూర్‌లోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపునకు స్థానిక ఉన్నత పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులను పంపించారు.

Source: Eenadu

చేర్యాలకు చెందిన ఆంజనేయులుకు చూపు లేదు. సిద్దిపేటలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్లర్కు విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం కూడా బ్యాంకు వైపు వెళ్లేందుకు యత్నించారు. ఇది గమనించిన ఓ ఆటో చోదకుడు అంధుడి చేయి పట్టుకొని తీసుకెళ్లారు.

Source: Eenadu

మునుగోడు ఉప ఎన్నికల్లో నేపథ్యంలో ఓ పార్టీ దీపావళి ధమాకాగా ఇంటింటికి మిఠాయి పెట్టెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో సుమారు రెండు వేల ఇళ్లకు వీటిని పంపిణీ చేసినట్లు తెలిసింది.

Source: Eenadu

ఆంధ్రా ఊటీ అరకులోయ సందర్శనకు వచ్చే పర్యటకులను పాల కడలిని తలపిస్తున్న మంచు సోయగాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అరకులోయకు 8 కి.మీ. దూరంలో ఉన్న మాడగడ కొండపై నుంచి మంచు అందాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

Source: Eenadu

కొత్తపల్లి జలపాతం సమీపంలో కొక్కిరాపల్లి ఘాట్‌లో మంచు అందాలు మైమరిపించాయి. గురువారం ఉదయం మంచు దుప్పటి అలముకుంది. కొక్కిరాపల్లి ఘాట్‌ కొండల్లో మంచు పర్యటకులను ఆకట్టుకుంది.

Source: Eenadu

అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద పెన్నానదిలో వరదల వల్ల గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదమని తెలిసినా కొందరు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మోకాలిలోతు నీటి వరకు నదిలోకి ఎడ్లబండ్లను తీసుకెళ్లి ఇసుక తరలిస్తున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home