చిత్రం చెప్పే విశేషాలు..!
(06-08-2022/1)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలు నగరంలో త్రివర్ణం మెరిసిపోతోంది. కట్టడాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఇందులో భాగంగా హంద్రీ వంతెనపై విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన మువ్వన్నెల రంగులు వెలిగిపోతున్నాయి.
Source: Eenadu
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గమ్మ అమ్మవారిని నోట్ల కట్టలతో విశేషంగా అలంకరించారు. నిర్వాహకులు, దాతల సహకారంతో సమకూరిన సుమారు రూ.10 లక్షలు విలువైన నోట్ల కట్టలతో అలంకరణ చేశారు.
Source: Eenadu
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ పరిమళించే పట్టుచీరను రూపొందించి ఔరా అనిపించాడు. విజయ్ ఐదున్నర మీటర్ల పొడవున్న ఎర్రని పరిమళించే పట్టుచీరను తయారు చేశాడు.
Source: Eenadu
తెలంగాణలోని రేషన్ బియ్యాన్ని రైలులో మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు కొందరు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. రైలు ఎక్కగానే బియ్యాన్ని బోగీలోని తలుపుల పక్కన పోసి పోలీసులకు కనిపించకుండా ఇలా దాస్తున్నారు.
Source: Eenadu
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రార్థనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న షియా వర్గ నేత ముక్తాదా అల్ సదర్ అనుచరులు.
Source: Eenadu
కరీంనగర్ శివారు దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) వద్ద హెడ్ రెగ్యులేటర్ గేట్ల సిమెంట్ దిమ్మెలకు పిచ్చుకల్లాంటి వందలాది పక్షులు బురద, బంకమట్టి మిశ్రమంతో ఇలా గూళ్లను నిర్మించుకున్నాయి.
Source: Eenadu
రక్షాబంధన్‌ను పురస్కరించుకుని గుజరాత్‌లోని సూరత్‌లో రాఖీ కట్టిన విద్యార్థినులకు జాతీయ జెండాను బహుకరిస్తున్న ముస్లిం విద్యార్థులు.
Source: Eenadu
పార్లమెంటులో నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: Eenadu